Dulquer Salman Manmarziyan Project Announced | బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టు.. నటించనున్న సౌత్ హీరో

Salman dulqer another project confirmed

Manmarziyan, Dulquer Salman, Anurag Kashyap, Taapsee Dulquer Salman, Karwaan Movie, Dulquer Salman Bollywood Movies

Manmarziyan if finally happening. After being put on the back burner and almost being shelved, the film, which is a love triangle, is showing sings of being able to see the light of day. The film’s cast if now final, with Dulquer Salman stepping into Ayushmann Khurrana’s shoes and joining Taapsee Pannu (who replaced Bhumi Pednekar) and Vicky Kaushal are also part of the film. The film will be South Indian heartthrobs’s second Bollywood film, after he makes his Hindi film debut with Karwaan Anurag Kashyap is directing the film.

మరో బాలీవుడ్ ప్రాజెక్టులో దుల్కర్ సల్మాన్

Posted: 12/04/2017 05:07 PM IST
Salman dulqer another project confirmed

మమ్మూటీ తనయుడు, మళయాళ యువ హీరో దుల్కర్ సల్మాన్ కు అక్కడ యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒక్కడిగా కొనసాగుతున్న నట వారసుడి పర భాషల్లో కూడా తన సత్తా చూపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే కోలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న దుల్కర్ త్వరలో మహానటి ద్వారా టాలీవుడ్ లోనూ అడుగుపెట్టబోతున్నాడు. జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ నటించబోతున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే 'కార్వాన్' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా అక్కడా అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో ఎగ్జయిటింగ్ ప్రాజెక్టుకు అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎప్ప‌ట్నుంచో హిందీ సినిమా అభిమానుల‌ను ఊరిస్తున్న 'మ‌న్‌మ‌ర్జియాన్' సినిమా ఎట్ట‌కేల‌కు ప‌ట్టాలెక్క‌నుంది. ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ లీడ్ రోల్ పోషించబోతున్నాడు. తాప్సీ, విక్కీ కౌష‌ల్ ప్ర‌ధాన పాత్రంలో న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి నిర్మాత‌గా ఆనంద్ ఎల్‌. రాయ్ వ్య‌వ‌హ‌రిస్తుండగా.. అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేయబోతున్నాడు.

మొద‌ట ఈ చిత్రం ఆయుష్మాన్ ఖురానా, భూమి ఫ‌డ్నేక‌ర్‌ల‌ను అనుకున్నారు. కానీ కుద‌ర‌లేదు. అలాగే ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు కూడా స‌మీర్ శ‌ర్మ నుంచి అశ్వ‌నీ అయ్య‌ర్ తివారీకి, అక్కడి నుంచి చివరగా అనురాగ్ క‌శ్య‌ప్‌కి చేరుకున్నాయి. వ‌చ్చే నెల హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 'మ‌న్‌మ‌ర్జియాన్' చిత్ర షూటింగ్ ప్రారంభ‌ కానుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

సావిత్రి జీవితంలో గొడవలన్నీ చూపిస్తారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles