Sye Raa Shooting Begins from Tomorrow | రేపటి నుంచే సైరా షూటింగ్.. అతను లేకుండానేనా?

Sye raa shooting updates

Chiranjeevi, Sye Raa Narasimha Reddy, Sye Raa Shooting Begins, Sye Raa Music Director, Sye Raa Technicians, Sye Raa New Music Director, Director Surendar Reddy

Chiranjeevi's prestigious period drama “Sye Raa Narasimha Reddy” shooting begins from tomorrow. Director Surender Reddy has readied everything for the shoot including huge sets at Aluminium factory in Kondapur in Hyderabad.

సైరా షూటింగ్ రేపటి నుంచే ప్రారంభం

Posted: 12/05/2017 02:58 PM IST
Sye raa shooting updates

ఖైదీ నంబర్ 150తో తిరిగి మేకప్ వేసుకోవటమే కాదు.. రావటం రావటమే రికార్డులు బద్ధలు కొట్టిన మెగాస్టార్ తన 151వ చిత్రం కోసం సిద్ధమైపోయారు. సైరా' సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను డిసెంబర్ 6వ తేదీ నుంచి మొదలుపెడుతున్నట్టుగా టీమ్ ప్రకటించింది. అలా ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపు మొదలుకానుంది.

సైరా ప్రత్యేకతలు ఇవే...

రేపు హైదరాబాద్ .. అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. చిరంజీవి గెటప్ ఎలా వుంది?.. ఆయన లుక్ ఎలావుంది? అనే విషయంలోఇటీవలే టెస్టు షూట్ చేశారు. చిరూ లుక్ పట్ల అంతా సంతృప్తిని వ్యక్తం చేయడంతో సెట్స్ పైకి వచ్చేస్తున్నారు. చిరూ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా చెప్పబడుతోన్న 'సైరా'లో, నయనతార కథానాయికగా నటించనున్న సంగతి తెలిసిందే.

కెమెరామెన్ రవివర్మన్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి రత్నవేలును తీసుకున్నారు. ఇక రెహ్మాన్ ప్లేస్ లో మరో మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంపిక చేసే పనిలో వున్నారు. కీరవాణి పేరు వినిపిస్తన్నప్పటికీ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఆ వర్క్ పెండింగ్ లో ఉండగానే చిత్ర షూటింగ్ మొదలుపెడుతుండటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles