Agnyaathavaasi Contains Cute Love Story | అజ్ఞాత‌వాసిలో క్యూట్ లవ్ స్టోరీ కూడానా?

Agnyaathavaasi trivikram no miss entertainment

Agnyaathavaasi Movie, Pawan Kalyan, Agnyaathavaasi Movie New Posters, Agnyaathavaasi Trivikram Movie, Agnyaathavaasi Love Story

Agnyaathavaasi Movie Shooting almost completed. New Posters Released and it seems to a fresh concept apart Trivikram Movie.

అజ్ఞాత‌వాసిలో ఆ ఎలిమెంట్స్ మిస్ కావంట!

Posted: 12/08/2017 06:35 PM IST
Agnyaathavaasi trivikram no miss entertainment

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు కథపరంగా వేర్వేరుగా ఉన్నా సినిమాలో ప్రధాన ఎలిమెంట్లలో మాత్రం ఎలాంటి లోటు ఉండదు. ముఖ్యంగా ఎంటైర్ టైన్ మెంట్ ఆయా సినిమాకు చాలా బలం. అందుకే 'అజ్ఞాత‌వాసి' సినిమాపై కూఢా ఇప్పుడు అలాంటి అంచనాలే నెలకొన్నాయి.

ఓ ఆంగ్ల చిత్ర రీమేక్ అన్న వార్తలు వినిపించినప్పటికీ.. మాటల మాంత్రికుడి మ్యాజిక్ కనిపించటం ఖాయమని చెబుతున్నారు. ఇక ఇందులో హీరోయిన్ కీర్తి సురేష్.. ప‌వ‌న్ క‌ల్యాణ్ బుగ్గ‌లు లాగేస్తోంది. హీరోయిన్ అలా చేస్తోంటే స‌ద‌రు హీరో చిన్న‌ పిల్లాడిలా ముఖం పెట్టారు. ఎర్ర రంగు చీర క‌ట్టుకుని కీర్తి సురేష్‌.. ఆకు ప‌చ్చ క‌ల‌ర్ టీష‌ర్ట్ వేసుకుని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇందులో క‌న‌ప‌డుతున్నారు. అభిమానుల‌ను ఈ స్టిల్ అల‌రిస్తోండగా.. ఎమోషన్స్ తోపాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉండబోతుందన్న సంకేతాలు అందుతున్నాయి. మరోవైపు కొత్త పోస్టర్లు కూడా సందడి చేస్తున్నాయి.

పవన్ సరసన క్తీరి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. అనిరుధ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో కుష్బూ, ఆదిపినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles