Shahid has beaten Hrithik for Sexiest Man Race | సెక్సీయస్ట్ మ్యాన్ షాహిద్.. ఏం ట్వీట్ చేశాడో చూడండి

Shahid kapoor named sexiest asian man in uk poll

Shahid Kapoor, Eastern Eye, Asjad Nazir Sexy List 2017, Asian Sexiest Man 2017, Hrithik Roshan , Shahid Kapoor Thanks, Shahid Kapoor Tweet, Shahid Kapoor Asian Sexiest Man

Bollywood Actor Shahid Kapoor voted the 'Sexiest Asian Man' by Eastern Eye. Shahid Thanks Fans In Adorable Tweet. Shahid has beaten actor Hrithik Roshan in the voted survey.

ఏషియన్ సెక్సీయస్ట్ మ్యాన్ గా షాహిద్ కపూర్

Posted: 12/14/2017 05:56 PM IST
Shahid kapoor named sexiest asian man in uk poll

వయసు ఎంత పెరిగినా తన లుక్కుతో ఇంకా యంగ్ గా కనిపించటం హీరో షాహిద్ కపూర్ కు చాలా అడ్వాంటేజ్ గా మారుతోంది. అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న షాహిద్ కు ఈ ఏడాది చివర్లో మరో తీపి గుర్తును అందించింది.

లండ‌న్‌కి చెందిన ఈస్ట‌ర్న్ ఐ వీక్లీ మేగ‌జైన్ ఓటింగ్ నిర్వ‌హించి ఆసియాలోని టాప్ 50 సెక్సీయ‌స్ట్ పురుషుల జాబితాను ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో బాలీవుడ్ న‌టుడు షాహిద్ క‌పూర్ మొద‌టి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో హృతిక్ రోష‌న్ ఉన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఓటు వేసిన అభిమానులంద‌రికీ షాహిద్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. `సెక్సీయస్ట్ అనేది శరీరానికి సంబంధించింది మాత్ర‌మే కాదు, అది మ‌న‌సుకు కూడా వ‌ర్తిస్తుంది` అన్నారు.

ఇంకా ఈ జాబితాలో గ‌త మూడేళ్లుగా హృతిక్ రోష‌న్ ప్రథమ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. బ్రిటీష్‌-పాకిస్థానీ గాయ‌కుడు జ‌యాన్ మాలిక్ మూడో స్థానంలో, హిందీ టీవీ న‌టుడు వివియ‌న్ దేశాయ్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఇంకా టీవీ న‌టుడు ఆశిష్ శ‌ర్మ (5), ఫ‌వాద్ ఖాన్ (6), స‌ల్మాన్ ఖాన్ (7), గుర్మీత్ చౌద‌రి (8), ర‌ణ్‌వీర్ సింగ్ (9)లు ఈ జాబితాలో ఉన్నారు. ప‌దో స్థానంలో క్రికెట‌ర్‌ విరాట్ కోహ్లీ నిలిచి, టాప్ 10లో ఉన్న ఏకైక క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. ఇంకా బ‌రున్ సోబ్తీ (11), అలీ జాఫ‌ర్ (12), వ‌రుణ్ ధావ‌న్ (13), అక్ష‌య్ కుమార్ (18), షారుక్ ఖాన్ (20)లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles