Samantha as Rathi Devi in Vishal's Irumbu Thirai | విశాల్ మూవీలో రతిదేవిగా సమంత

Samantha role in vishal movie

Samantha Akkineni, Hero Vishal, Irumbu Thirai, Abhimanyudu, Samantha Abhimanyudu, Vishal Film Factory, Samantha Rathi Devi

Samantha Akkineni Role reveal in Vishal's Irumbu Thirai. Samantha as Doctor Rathi Devi in Movie Poster Released by Makers.

విశాల్ మూవీలో రతిదేవిగా సమంత

Posted: 12/26/2017 01:10 PM IST
Samantha role in vishal movie

డీగ్లామర్ రోల్స్ సినిమాల ఎంపికతో సమంత కంటిన్యూ అయ్యే అవకాశాలు బోలెడు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవి అన్నీ అలాంటి ప్రాజెక్టులే. ఒక వైపున తెలుగులో అగ్రకథానాయకుల సరసన నటిస్తూనే .. మరో వైపున తమిళంలో స్టార్ హీరోల జోడీగా సమంత నటిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు భాషల్లోను ఆమె అగ్ర కథానాయికగా కొనసాగుతోంది.

కోలీవుడ్ లో విశాల్ సరసన 'ఇరుంబు తిరై' సినిమా చేస్తోంది. రీసెంట్ గా విశాల్ పాత్రను పరిచయం చేస్తూ ఆయన పోస్టర్ ను రిలీజ్ చేసిన ఈ సినిమా టీమ్, తాజాగా 'డాక్టర్ రతీదేవి'గా సమంత పాత్రను పరిచయం చేస్తూ ఆమె పోస్టర్ ను పరిచయం చేశారు. సైకాలజీలో పిహెచ్.డి చేసిన డాక్టర్ పాత్రలో సమంత ఈ సినిమాలో కనిపించనుంది. ఈ పాత్ర ద్వారానే ఈ సినిమా కథ మలుపు తిరుగుతుందని సమాచారం.

విశాల్ సొంత బ్యానర్ లో పి.ఎస్.మిత్రన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రైతుల సమస్యలు, అవినీతి నిర్మూలన కాన్సెప్ట్ లతో తెరకెక్కుతోంది. జనవరి 26వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను అభిమన్యుడు పేరుతో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Introducing #Samantha as Dr. RathiDevi#IrumbuThirai from #Jan2018@VishalKOfficial @Samanthaprabhu2 @akarjunofficial @thisisysr @AntonyLRuben @george_dop @Psmithran pic.twitter.com/ThI0ys3Ciq

— Vishal Film Factory (@VffVishal) 26 December 2017

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Vishal  Abhimanyudu  పమంత  విశాల్  అభిమన్యుడు  

Other Articles