Kamal's ex-wife Sarika left distressed and homeless | కమల్ మాజీ వైఫ్ కష్టాల్లో.. సాయం కోసం అమీర్ ను కోరిన సీనియర్ నటి

Kamal ex wife house trouble

Kamal Haasan, Sarika, Shruthi Haasan, Homeless, Legal Trouble, Sarika House Problem, Sarika Aamir Khan, Kamal Ex Wife Sarika

Kamal's ex-wife, Shruthi Haasan's Mother Sarika left distressed and homeless. Sarika Gets Help From Aamir Khan To Reclaim Her House.

సారికకు ఇంటి కష్టాలు.. అమీర్ ను ఆశ్రయించారు

Posted: 12/26/2017 05:09 PM IST
Kamal ex wife house trouble

కెరీర్ సవ్యంగా కొనసాగే సమయంలోనే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే చివరి దశలో నానా కష్టాలు పడాల్సి వస్తుందని పలువురు తారాల జీవితాలు రుజువు చేశాయ్. సావిత్రి. సిల్క్ స్మిత. ఇలా వీళ్ళందరి లైఫ్ లో ఇది జరిగిందే. అయితే ఇప్పుడు వారి గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే... ఇక్కడ చెప్పుకోబోయే కథనాయిక పరిస్థితి కూడా అలా తయారయ్యింది కాబట్టి.

కమల్ మాజీ వైఫ్, ఒక్కప్పుడు హీరోయిన్ గా ఏలిన సారిక విషయంలో ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి కాబట్టి. సారిక తన కెరీర్ లో కష్టపడి సంపాదించిన డబ్బుతో ముంబై లో ఓ ఖరీదైన నివాసం కొనుకున్నారు. కాని ఆ నివాసాన్ని ఆమె తల్లి లాగేసుకుంది. తల్లిని కష్ట పెట్టడం ఇష్టం లేక.. ఇంత కాలం సారిక సైలెంట్ గానే ఉండిపోయింది. అయితే ఆమె తల్లి మాత్రం తాను చనిపోయాక ఆ ఇంటిని ఎవరో విక్రమ్ తక్కర్ అనే డాక్టర్ పేరు మీద ఆ ఇంటిని రాసి చనిపోయిందట. దీంతో ఆ మ్యాటర్ సెటిల్ అయ్యేవరకు.. ఈ లేటు వయస్సులో సారిక ముంబయ్ లో అద్దెకు ఉండాల్సి వస్తోంది.

ఇక ఈ మ్యాటర్ ను కాస్త పరిష్కరించేందుకు చొరవ చూపాలని స్టార్ హీరో అమీర్ ఖాన్ హెల్ప్ ఆమె తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె బెస్ట్ ఫ్రెండ్ నుజాత్ ఖాన్ (ఇమ్రాన్ ఖాన్ తల్లి) అమీర్ ఖాన్ కు కజిన్. మరి ఈ మ్యాటర్ లో అమీర్ సాయం చేస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles