Sharwa Sudheer Varma Movie Shelved | మల్టీస్టారర్ కి ఓకే.. ఆ దర్శకుడికి నాట్ ఓకే?

Sharwanand cancel movie with sudheer varma

Sudheer Varma, Sharwanand, Harish Shankar, Haarika & Hassine Creations, Hanu Raghavapudi

News Surrounded in filmnagar that Sharwanand movie cancelled with Sudheer Varma.

శర్వా సుధీర్ కు హ్యాండిచ్చినట్లేనా?

Posted: 12/26/2017 07:45 PM IST
Sharwanand cancel movie with sudheer varma

శర్వానంద్ వైవిధ్యమైన సినిమాలతోనే రాణిస్తున్నప్పటికీ ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ కథలను ఎంచుకుంటున్నాడు. అయితే స్వామిరారా'.. 'కేశవ' సినిమాల దర్శకుడు సుధీర్ వర్మ తన తదుపరి చిత్రం ఎంచుకుని టాలీవుడ్ లో చర్చకు దారితీశాడు. ఈ క్రమంలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలను చేబోతున్నాడని చెప్పుకున్నాం.


హారిక హాసిని సంస్థ బ్యానర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ముందుకు వచ్చారు. మారుతి - చైతూ సినిమాతో పాటు ఈ సినిమాను కూడా వచ్చేనెల మొదటివారంలో పట్టాలెక్కించాలనుకున్నారు. అయితే ఈ కథ విషయంలో కొన్ని సూచనలు చేసిన శర్వానంద్, హను రాఘవపూడితో మరో ప్రాజెక్టును మొదలుపెట్టేశాడు. అంతేకాదు .. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో హరీశ్ శంకర్ తో మల్టీస్టారర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

దాంతో ఇక సుధీర్ వర్మతో శర్వానంద్ సినిమా లేనట్టేననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంపై హారిక హాసిని వారు .. సుధీర్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles