Tollywood 2017 Review Round Up Biggest Hits | టాలీవుడ్ రౌండప్.. 2017 రివ్యూ

Tollywood round up 2017

Tollywood 2007, Tollywood 2017 Hits, Tollywood Review 2017, Baahubali Arjun Reddy, Tollywood Biggest Hits

2017 saw a bunch of new talents joining the workforce of the Telugu film industry as actors. While many seasoned actors made an impressive comeback, a handful of established stars further escalated their careers to superstardom worldwide.

టాలీవుడ్ రౌండప్-2017

Posted: 12/30/2017 05:42 PM IST
Tollywood round up 2017

టాలీవుడ్ 2017కి ముగింపు పలుకుతోంది. అయితే చివర్లో వచ్చిన చిత్రాలకు అంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాకపోవటంతో బిగ్ సక్సెస్ లేకుండానే ఈ ఏడాది ముగిసిపోయింది. బాహుబలితో భారతీయ సినీ చరిత్రలోనే టాలీవుడ్ నిలిచిపోగా.. మరికొన్ని చిత్రాలు అద్భుతాలనే సృష్టించాయి. గతంతో పోలిస్తే ఈసారి పరిస్థితి ఎంతో మెరుగనే చెప్పుకోవాలి.

బాహుబలి: ది కంక్లూజన్...

వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.1750 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రమిది. వసూళ్ల విషయంలోనే కాదు.. కంటెంట్ పరంగానూ ‘బాహుబలి-2’ అందరి ప్రశంసలందుకుంది. ఈ వసూళ్లు కూడా కేవలం రెండు వారాల్లోనే రావటం మరో విశేషం. మొదటి పార్ట్ లో కేవలం విజువల్ ట్రీట్ అందించిన దర్శకధీరుడు రెండో పార్ట్ లో బలమైన ఎమోషన్ కంటెంట్ ను అందించాడు. నటీనటులతోపాటు టెక్నీకల్ టీం అందరి సమిష్టి కృషితో బాహుబలి: ది కంక్లూజన్ ఓ మహాధ్బుతంగా నిలిచింది. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. అటు బాలీవుడ్ లో ఏకంగా 500 కోట్లు రాబట్టి ఇప్పటిదాకా ఏ చిత్రం కూడా దానిని బీట్ చేయలేనంత స్థానంలో నిలిచింది.

అర్జున్ రెడ్డి.. టాలీవుడ్ లో ఇది పాత్ బ్రేకింగ్ అనే చెప్పాలి. తెలుగు సినిమా నడతను ఆ స్థాయిలో ప్రభావితం చేసిన సినిమాగా ‘అర్జున్ రెడ్డి’ని అభివర్ణించారు కొందరు విశ్లేషకులు. అయితే కాస్త బోల్డ్ కంటెంట్ ఎక్కువైపోవటం, పైగా వివాదాలు... అన్ని వర్గాల ఆమోదం పొందకపోవటం ఈ చిత్రానికి మైనస్. కానీ, మెజార్టీ యూత్ లో బాగా ఇంపాక్ట్ చూపించటంలో ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మొత్తానికి 2017 అర్జున్ రెడ్డి ద్వారా రెవల్యూషనరీ ఫిలిం అందించాడు దర్శకుడు సందీప్ వంగా. పెట్టుబడి-రాబడి కోణంలో కూడా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఇదే.

ఫిదా... తక్కువ బడ్జెట్లో తెరకెక్కి మంచి విజయం సాధించిన సినిమాలు మరికొన్ని వచ్చాయి. అందులో ‘ఫిదా’ ఒకటి. కథానాయిక ప్రాధాన్యమున్న కథతో.. సాయి పల్లవి లాంటి హైబ్రీడ్ పిల్లతో పెద్ద మ్యాజిక్ చేశాడు శేఖర్ కమ్ముల. తెలంగాణ అమ్మాయిగా సాయిపల్లవి పాత్రే సినిమా మొత్తాన్ని నిలబెట్టింది. సంగీతం, ఫీల్ గుడ్ సాంగ్స్, కామెడీ టైమింగ్, ఆహ్లాదకరమైన టేకింగ్ ఇలా అన్ని అంశాలు చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. సుమారు రూ.50 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి బిగ్ హిట్ గా నిలిచిందీ చిత్రం.

ఘాజీ... సంకల్ప్ రెడ్డి అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అబ్బురపరిచే రీతిలో తెరకెక్కించాడు. సబ్ మెరైన్ కాన్సెప్ట్ ను తొలిసారి పరిచయం చేస్తూ చరిత్రలో కనుమరుగు అయిపోతుందన్న అంశాన్ని నేటి యువతకు అర్థమయ్యేలా విపులంగా వివరించిన సంకల్ప్ రెడ్డికి హాట్సాఫ్. పైగా తక్కువ బడ్జెట్లో గొప్ప క్వాలిటీతో ఈ సినిమాను చిత్రీకరించాడు. తెలుగుతో పాటు హిందీ తమిళంలోనూ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ‘బాహుబలి’ తర్వాత తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది.

ఖైదీ నంబర్ 150... దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమాకు మకుటం లేని మహారాజుగా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఏడాదిగా కూడా 2017ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 9 ఏళ్ల విరామం తర్వాత ఆయన హీరోగా నటించిన ‘ఖైదీ నంబర్ 150’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రం నాన్-బాహుబలి కలెక్షన్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేయడం విశేషం.

గౌతమీపుత్ర శాతకర్ణి... తెలుగువారి చరిత్రను సాహోసేపేతంగా తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. పరిమిత వనరులతో కేవలం 79 రోజుల్లో ఈ చిత్రాన్ని అతను మంచి క్వాలిటీతో రూపొందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలుగు సినిమా చరిత్రలో ఇది కూడా ఒక ప్రత్యేకమైన చిత్రమే. బాలయ్య అసమాన నటన.. డైలాగులు, క్రిష్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి.

శతమానం భవతి... ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ పంగడ సీజన్ తో వచ్చి ఫర్ ఫెక్ట్ హిట్ గా నిలిచింది. పెద్ద వసూళ్ల నడుమ మంచి వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది.

నాని-ఆది పినిశెట్టి-నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు శివ నిర్వాణ ‘నిన్నుకోరి’ లాంటి ఆహ్లాదకరమైన సినిమాను అందించాడు. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది.

వెంకటేష్.. రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన రీమేక్ మూవీ ‘గురు’ ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా. ఇది విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లూ అందుకుంది.

నాని నటించిన ‘నేను లోకల్’ యావరేజ్ కంటెంట్ తోనే బ్లాక్ బస్టర్ అయింది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’.. ‘నేనే రాజు నేనే మంత్రి’.. ‘మహానుభావుడు’.. ‘అమీతుమీ’ సినిమాలు కొంచెం కొత్తగా ఉంటూనే ప్రేక్షకుల్ని
అలరిస్తూ కమర్షియల్గా కూడా మంచి విజయం సాధించాయి. తాప్సి - శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రల్లో మహి వి.రాఘవ్ తీర్చిదిద్దిన హార్రర్ కామెడీ ‘ఆనందో బ్రహ్మ’ కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇప్పటిదాకా వచ్చిన హార్రర్ కామెడీలకు ఇది భిన్నంగా అనిపించింది. అలాగే వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడు శ్రీవిష్ణు హీరోగా రూపొందించిన ‘మెంటల్ మదిలో’ కూడా న్యూ వేవ్ మూవీనే. ఇక చాలా కాలం తర్వాత రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు రూపొందించిన ‘గరుడవేగ’ హాలీవుడ్ థ్రిల్లర్లకు ఏమాత్రం తీసిపోని సినిమానే. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ.. ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతూ సాగిందీ చిత్రం.


1. బాహుబలి: ది కంక్లూజన్
2. అర్జున్ రెడ్డి
3. ఫిదా
4. శతమానం భవతి
5. ఖైదీ నంబర్ 150
6. గౌతమీపుత్ర శాతకర్ణి
7. ఘాజి
8. నేను లోకల్
9. నిన్ను కోరి
10. రారండోయ్ వేడుక చూద్దాం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  2017  Round Up  టాలీవుడ్  2017  రౌండ్ అప్  

Other Articles