Vishal Serious on Anchors over Suriya Height | సూర్య ఎత్తు గురించి జోకులు.. విశాల్ ఆగ్రహం

Vishal fire on suriya height comments

Actor Vishal, Suriya, Franka Sollata, Anchors, Sun Music Anchors, Vishal Suriya, Suriya Height Comments,

Actor Vishal fire on TV anchors for make fun of Suriya's height on show, face wrath on social media. The show 'Franka Sollata', which is anchored by two women, takes potshots at celebrities and discusses film industry gossip.

సూర్య ఎత్తు గురించి కామెంట్లు.. విశాల్ ఫైర్

Posted: 01/19/2018 03:56 PM IST
Vishal fire on suriya height comments

లైవ్ షోలో కోలీవుడ్ సూర్య హీరో సూర్య ఎత్తు గురించి సూర్యను ఓ ఇద్ద‌రు యాంక‌ర్లు కామెంట్ చేయ‌డం ఇప్పుడు కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌న్ మ్యూజిక్ ఛాన‌ల్‌లో ప్రసార‌మ‌య్యే 'ఫ్రాంకా సొల్ల‌టా' అనే కార్య‌క్ర‌మంలో ఇద్ద‌రు మ‌హిళా యాంక‌ర్లు సూర్య ఎత్తును అవ‌హేళ‌న చేశారు.

అమితాబ్‌తో న‌టించాలంటే సూర్య కుర్చీ వేసుకోవాల‌ని, లేదా అమితాబ్ కుర్చీలో కూర్చుని న‌టించాల‌ని వారు అన్నారు. అయితే ఈ మాట‌ల‌పై త‌మిళ ప‌రిశ్ర‌మ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ న‌టుడు విశాల్ ట్వీట్ చేశారు. 'ఈ మ‌ధ్య ప్ర‌తి ఒక్క‌రికి కామెంట్ చేయడానికి సినిమా వాళ్లే దొరికారు' అని ఆయ‌న పోస్ట్ చేశారు. విశాల్ ట్వీట్‌కి మ‌ద్ద‌తుగా గ్యాంగ్ చిత్ర ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్ కూడా ట్వీటారు.

న‌టుడిగా ఎన్నో విజ‌యాలు సాధించిన సూర్య లాంటి వారి మీద ఇలాంటి కామెంట్లు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. కాగా, 'గ్యాంగ్' చిత్రంలో సూర్య 'నువ్వు ఎంత ఎత్తు ఉన్నావ్ అని కాదు... ఎంత ఎత్తు ఎదిగామ‌నేది ముఖ్యం' అని ఓ డైలాగ్ చెబుతాడు. ఆ డైలాగ్ ను ఉద్దేశించే యాంకర్లు కామెంట్లు చేయటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles