తీవ్ర ఉద్రిక్తతల మధ్య విడుదలైనప్పటికీ వసూళ్ల విషయంలో సంజయ్ లీలా భన్సాలీ 'పద్మావత్' చిత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మొదటి రెండ్రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్కును దాటేసిన ఈ చిత్రం, మొదటి వారాంతానికి రూ. 100 కోట్ల మార్కును దాటింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్ర, శని, ఆదివారాలు ఇలా దీర్ఘవారాంతం ఈ సినిమాకు కలిసొచ్చింది.
శని, ఆదివారాల్లో మెట్రో నగరాల్లో ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. పెయిడ్ ప్రీవ్యూస్‌తో కలిపి నాలుగు రోజుల్లో పద్మావత్ చిత్రం రూ. 114 కోట్ల వరకు వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు. నిజానికి విశ్లేషకుల అంచనా ప్రకారం మొదటి వారాంతంలో రూ. 140 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శనకు అడ్డంకులు రావడంతో వసూళ్లు పడిపోయాయని బాక్సాఫీస్ ఇండియా వెల్లడించింది.
బుధవారం రూ. 5 కోట్లు (పెయిడ్ ప్రీవ్యూస్), గురువారం రూ. 19 కోట్లు, శుక్రవారం రూ. 32 కోట్లు, శనివారం రూ. 27 కోట్లు, ఆదివారం రూ. 30 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, వయాకామ్ 18 సంస్థతో కలిసి రూ. 190 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో తెరకెక్కించారు. మరో వారం పాటు ఏ చిత్రం లేకపోవటంతో వసూళ్ల ప్రభంజనం కొనసాగే అవకాశం ఉంది.
మలేషియాలో నిషేధం..
మలేషియాలో పద్మావత్ పై బ్యాన్ పడింది. ఈ సినిమా విడుదలకు అక్కడి సెన్సార్ బోర్డ్ ఎల్పీఎఫ్ ఒప్పుకోలేదు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు ఉన్నాయని, మలేషియాలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్న కారణంగా ఈ సినిమా విడుదలకు అంగీకరించడం లేదని ఎల్పీఎఫ్ చైర్మన్ మహ్మద్ జాంబేరీ అబ్దుల్ అజీజ్ తెలిపారు.
సినిమా కథాంశమే ముస్లింల భావాలకు వ్యతిరేకంగా ఉందని ఆయన అన్నారు. అయితే సినిమాలో హిందువులను కించపరిచే విషయాలున్నాయని భారత్‌లో కర్ణి సేన నిరసనలు, ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. మరో ముస్లిం దేశం పాకిస్థాన్‌లో ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా విడుదలకు అక్కడి సీబీఎఫ్సీ అంగీకరించటం గమనార్హం.
Deepika has emerged the undisputed Queen of ₹ 100 cr Club... #Padmaavat is @deepikapadukone’s seventh film to cross ₹ 100 cr mark [#ChennaiExpress, #HNY, #YJHD, #BajiraoMastani, #RamLeela, #Race2]... The HIGHEST by any leading lady... An enviable track record!
— taran adarsh (@taran_adarsh) January 29, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more