Five Super Stars Chief Guest for 2 Point 0 Teaser | ఐదుగురు సూపర్ స్టార్లతో రజనీ టీజర్ లాంఛ్

Rajini teaser launch details

2 Point 0 Teaser, Rajinikanth, Director Shankar, Chiranjeevi, Mammootty, Mohanlal, Lyca Productions, 2 Point 0 Teaser Kamal Haasan

2 Point 0 Date and Venue fixed. Actors Chiranjeevi besides Mohanlal and Mammootty are expected to attend the grand teaser launch of Shankar's magnum opus film 2 Point 0. Sources say that the teaser launch of the film will be in Hyderabad in the third week of February. Produced by Lyca Productions.

2.0 టీజర్ లాంఛ్ కు భారీ ఏర్పాట్లు

Posted: 01/30/2018 07:17 PM IST
Rajini teaser launch details

తలైవా ఫాన్స్ కు గుడ్ న్యూస్. 2.0 చిత్ర టీజర్ విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకను సినిమా ఫంక్షన్లను తలదన్నే రీతిలో హైదరాబాద్ తో పాటు చెన్నైలో కూడా నిర్వహించే ప్లాన్ లో ఉన్నారు. విశేషం ఏంటంటే ఈ టీజర్ రిలీజ్ కోసం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా జాయిన్ కాబోతున్నారు.

తెలుగు నుంచి చిరంజీవి - తమిళ్ నుంచి కమల్ హాసన్ - మలయాళం నుంచి మమ్ముట్టి-మోహన్ లాల్ ప్రత్యేక అతిధులుగా రాబోతున్నారు. కన్నడ నుంచి శివ రాజ్ కుమార్ ని పిలిచే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళంతా వయసు పరంగా సినిమాల కౌంట్ పరంగా అన్నింటిలోను రజనికి సమకాలికులు. అందుకే అంగరంగ వైభవంగా జరిగే ఆ వేడుకకు వీళ్ళు వస్తేనే బాగుంటుంది అని శంకర్ భావించినట్టు టాక్. ఫిబ్రవరి రెండో వారం ఈ ఈవెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

అది మొదలు 2.0 ప్రమోషన్ వేగాన్ని పెంచబోతున్నారు. టీజర్ రిలీజ్ రోజునే విడుదల తేది ప్రకటించే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 13 లేదా ఏప్రిల్ 27 అనే దాని గురించి సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. దీని కంటే కాలానే ముందు వస్తుంది అనే వార్తలు కూడా ఈ మధ్య షికారు చేసాయి. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తుండగా హీరొయిన్ అమీ జాక్సన్ కూడా ఇందులో రోబో పాత్రనే పోషిస్తున్నట్టు వినికిడి. దుబాయ్ లో జరిగిన ఫస్ట్ లుక్ ఆడియో లాంచ్ కే పది కోట్ల దాకా ఖర్చు పెట్టారు అనే టాక్ ఇప్పటికీ హాట్ హాట్ గానే ఉంది. ఇక్కడ కూడా దానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో చేయబోతున్నారు అని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles