మణిశర్మ గత కొంత కాలంగా బడా చిత్రాలకు సంగీతం అందించటం మనం చూడట్లేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం ఆయన అదరగొడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ క్రేజీ మల్టీస్టారర్ కు సంగీతం అందించబోతున్నట్లు సమాచారం.
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్ ఓ మల్టీస్టారర్ మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 24 నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఎంపికయ్యారని తెలిసింది. అశ్వనీదత్, నాగ్, నాని, శ్రీరామ్ ఆదిత్య.. ఇలా ఈ నలుగురితోనూ గతంలో మణిశర్మ పనిచేయడమే కాకుండా.. విజయాలను కూడా అందించారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం కథానాయికల ఎంపిక జరుగుతోంది. నాని సరసన రకుల్, నివేదా థామస్ పేర్లు పరిశీలనలో ఉండగా, నాగ్ కోసం ఓ సీనియర్ నటి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more