Anasuya Clarifies on Breaking Mobile Incident | అనసూయ ఫోన్ పగల కొట్టిందంటూ రచ్చ.. అసలేం జరిగిందో తెలుసా?

Anasuya on phone smash controversy

Anasuya Bharadwaj, Anchor Anasuya, Mobile Breaking, Tarnaka Police Station, Anasuya News, Anasuya Break Mobile, Woman Angry at Anasuya, Police Complaint at Anasuya, Anasuya on Mobile Breaking Incident

A woman files case against Anchor Anasuya Bharadwaj at Tarnaka PS for breaking mobile.But, Anasuya clarifies that the Lady Is Spreading False News.

నేనెవరి ఫోన్ పగలగొట్లేదు : అనసూయ

Posted: 02/06/2018 03:25 PM IST
Anasuya on phone smash controversy

ప్రముఖ యాంకర్ అనసూయపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఫోన్ ను పగలగొట్టడమే కాక, తమపై అసభ్యపదజాలంతో దుర్భాషలాడిందని ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఒక పని నిమిత్తం హైదరాబాదులోని తార్నాక ప్రాంతానికి అనసూయ వెళ్లింది. అదే సమయంలో తన తల్లితో పాటు ఓ బాలుడు అటుగా వెళ్తున్నాడు. అనసూయ కనిపించగానే ఆమె వద్దకు వెళ్లి, అభిమానంతో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. తమ మొబైల్ ద్వారా ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించగా... ఇది గమనించిన అనసూయ ఆగ్రహంతో బాలుడి చేతిలోని ఫోన్ ను లాక్కుని, నేలకేసి కొట్టింది.

జరిగిన ఘటనతో తల్లీకుమారుడు ఇద్దరూ బిత్తరపోయారు. ఫోన్ ఎందుకు పగలగొట్టావని బాలుడి తల్లి ప్రశ్నించగా... సమాధానం చెప్పకుండానే, వారిని దుర్భాషలాడుతూ అనసూయ అక్కడి నుంచి వెళ్లి పోయింది. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

అనసూయ వివరణ...
అయితే ఆ మహిళ చేస్తున్న ఆరోపణలను ట్విటర్ వేదికగా అనసూయ కొట్టిపడేసింది. తానే ఫోన్ పగలగొట్టలేదని.. సోమవారం తన తల్లిని చూసేందుకు వెళ్లిన సమయంలో ఆ తల్లికొడుకులిద్దరూ తనను వీడియో తీయటం ప్రారంభించారని.. వారిద్దరు తనకు దగ్గరగా రావటం గమనించి వారించి కారు ఎక్కేసి వచ్చానని ఆమె వివరణ ఇచ్చుకుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles