హాలీవుడ్ లో ఓ వార్త ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. ప్రము నటుడు సిల్వెస్టర్ స్టాలోన్(71) చనిపోయాడంటూ నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. దీంతో పలువురు నెటిజన్లు స్టాలోన్ కు సంతాప సందేశాలు పెట్టడం ప్రారంభించారు. కాసేపటికే ఈ వార్త కాస్త స్టాలోన్ చెవిన పడింది. ఇక ఊరుకుంటాడా?
నేను బతికే ఉన్నానని, ఆరోగ్యంతో ఆనందంగా ఉన్నా, ఇంకా ఫైట్లు చేసేంత బలంగా ఉన్నా.. అంటూ క్లారిటీ ఇచ్చాడు. మరవైపు ఈ పుకార్లపై స్టాలోన్ సోదరుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్రతికున్న వ్యక్తిని చంపేవారకి సమాజంలో ఉండే అర్హతే లేదని అన్నాడు. కాగా, ఇంతకీ ఈ పుకారెలా పుట్టిందంటే గమనిస్తే... స్టాలోన్ తాజాగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ పాత్ర కోసం కొత్త గెటప్ వేసుకున్నాడు. జుట్టు ఉడిపోయి, వడలిపోయి ఆ లుక్కును చూసి చాలా మంది ఆయనకు కేన్సర్ సోకిందంటూ కథలు అల్లేశారు. మరికొందరు ఏకంగా ఆయన ఆ వ్యాధిలో ఈ ఉదయం చనిపోయాడంటూ గాలి వార్తను పుట్టించారు.
ఇది తెలియని నెటిజన్లు ఆ ఫోటోలను షేర్ చేస్తూ, అవే నిజమని నమ్మి రిప్ సందేశాలు పెడుతున్నారు. తన కూతుళ్లతో సరదాగా గడిపిన ఓ వీడియోను విడుదల చేశారు కూడా. రాకీ, రాంబో చిత్రాలతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ఆయన ఈ ఏడాది ఎస్కేప్ ఫ్లాన్-2 హడేస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Please ignore this stupidity… Alive and well and happy and healthy… Still punching! https://t.co/sgRhOguHhs
— Sylvester Stallone (@TheSlyStallone) February 19, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more