Rakul Again Team up with Karthi Movie Begins | అట్టర్ ఫ్లాప్ తో ఢీలా.. రకుల్ బ్యాక్ టూ సౌత్ ఇండస్ట్రీ

Rakul back to south industry

Actor Karthi, Rakul Preet Singh, Karthi 17, Director Rajat Ravishankar, Prince Pictures,Harris Jayaraj

Karthi 17th Movie Shooting Begins. Actor Suriya as the Chief Guest for the pooja of Karthi, Rakul Preet Singh film. To be shot in Chennai, Mumbai, Hyderabad, picturesque Himalayan regions and also in Europe. Karthik. Prakash Raj and Ramya Krishnan on board too. Rajat Ravishankar Directs this film.

కార్తీ-రకుల్ జంటగా మరో సినిమా.. షూటింగ్ ప్రారంభం

Posted: 03/03/2018 12:13 PM IST
Rakul back to south industry

మిగతా హీరోయిన్ల లాగే బోలెడు ఆశలతో బాలీవుడ్ లో తిరిగి అడుగుపెట్టిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అయ్యారీ డిజాస్టర్ తో ఢీలా పడిపోయింది. అప్పటిదాకా తెలుగు ప్రాజెక్టులను ఒప్పుకోకుండా బెట్టు చేసిన ఆమె.. తిరిగి ఇప్పుడు మళ్లీ సౌత్ సినిమాలు ఓకే చేస్తోంది.

తెలుగు సంగతి పక్కన పెడితే కోలీవుడ్ లో విశాల్ తో ఓ సినిమాకు కమిట్ అయిన ఈ పంజాబీ బ్యూటీ.. ఇప్పుడు మరో చిత్రంలోనూ నటిస్తోంది. కార్తీతో ఈ మధ్యే ఖాకీలో అలరించిన రకుల్.. ఇప్పుడు మరో చిత్రంలో నటిస్తోంది. ఈ రోజు ఉదయం ఆయన తాజా చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. కార్తీ తండ్రితో పాటు సూర్య .. ఈ సినిమాలో కథానాయికగా చేయనున్న రకుల్ తదితరులు ఈ సినిమా పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

కార్తీకి ఇది 17వ సినిమా.. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఖాకీ తమిళ్ లో బిగ్ హిట్ కాగా.. తెలుగులో యావరేజ్. మరి ఈ చిత్రం అయినా ఆమెకు హిట్ అందిస్తుందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles