Rangasthalam Rangama Mangama Song Out | రంగస్థలం.. రంగమ్మ మంగమ్మ అవుట్

Rangasthalam third song out

Rangasthalam, Rangama Mangama Song, Ram Charan, RC11, Director Sukumar, Devi sri Prasad, Samantha Akkineni, Singer Manasi

Rangasthalam Third Song Released. Rangamma Mangamma Out and Out Energetic song Composed by Devi Sri Prasad.

రంగమ్మ మంగమ్మ పాట విడుదల

Posted: 03/08/2018 06:06 PM IST
Rangasthalam third song out

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం నుంచి మూడో పాట వచ్చేసింది. రంగమ్మ.. మంగమ్మ అంటూ సాగే మాస్ బీట్ ను దేవీ అందించాడు. మానసి పాడిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. దేవీ అందించిన బీట్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా చిట్టి బాబును టీజ్ చేస్తూ రామలక్ష్మి పాడిన పాటగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రంలోనే ఎంత సక్కగున్నవే.. రంగస్థలం టైటిల్ సాంగ్ లకు విపరీతమైన ఆదరణ దక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూడో సాంగ్ కూడా దుమ్ము రేపటం ఖాయంగానే కనిపిస్తోంది.



దేవీ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం రంగస్థలం అనే గ్రామం నేపథ్యంలో తెరకెక్కుతోంది. రామ్ చరణ్, సమంత, అనసూయ, జగపతిబాబులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ డైరెక్ట్ చేశాడు. మార్చి 30న రంగస్థలం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles