Ileana named Fiji tourism brand ambassador ఇల్లి అందంతో ఓ దేశమే గాలం వేస్తుంది.. ఎలా.?

Ileana d cruz named brand ambassador for tourism fiji

actress, ileana d'cruz, ileana, tourism fiji, brand ambassador, barfi, barfi!, Tourism, beautiful country, brand ambassador, nominate, indian market, tollywood, bollywood, entertainment, movies

Actress Ileana D’Cruz has been appointed Tourism Fiji’s brand ambassador for the Indian market. She said the warmth and hospitality there makes her feel like it’s “home.”

ఇల్లి అందంతో ఓ దేశమే గాలం వేస్తుంది.. ఎలా.?

Posted: 03/23/2018 05:26 PM IST
Ileana d cruz named brand ambassador for tourism fiji

గోవా బ్యూటీగా, పొడుగుకాళ్ల సుందరిగా, నడుము సన్నని నెరజానగా గోవా నుంచి దక్షిణాది మొత్తం కుర్రకారు గుండెల్లో చెదరని స్థానాన్ని సంపాదించి అటు బాలీవుడ్ బీజీగా మారిన ఇలియానా అందంతో ఓ దేశమే భారతీయులపై గాలం వేస్తుంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ అటు సినీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకుంటూ జోరు మీదుంది. అయితే ఇల్లి అందాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఓ దేశం వేసిన ఎత్తుగడ తెలుసా..?
 
తాజాగా ఈ బ్యూటీకి ఓ ఆఫర్ వచ్చేంది. దాంతో ఇల్లి ఎగిర గెంతేస్తుంది. ఆ ఆపర్ ఏంటంటే.. ఫిజీ దేశ పర్యాటక రంగం తరపున ప్రచారం చేయడానికి బ్రాండ్‌ అంబాసిడర్ గా ఇలియానా నియమించబడింది. ‘ఫిజి లాంటి అందమైన దేశంతో కలసి పనిచేసే అదృష్టం రావటం చాలా సంతోషాన్నిచ్చింది. ఆ దేశ ప్రజల ఆతిథ్యం, ప్రేమ నాకు సొంతింటిలో ఉన్న ఫీలింగ్‌ కలిగించాయి. ఇంకా ఇక్కడున్న చాలా ప్రదేశాలు చూసిన తర్వాతనే తిరిగి రావడం గురించి ఆలోచిస్తాను’ అని గోవా బ్యూటీ పేర్కోంది.
 
ఇలియానాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించటం తమ దేశ పర్యాటక రంగ అభివృద్దికి చాలా దోహదపడుతుందని.. దీంతో తమ దేశంలో పర్యటించే భారతీయుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశిస్తున్నామని ఫిజీ పర్యాటక శాఖ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పరిణితీ చోప్రా ఆస్ట్రేలియా తరుపున, సిదార్థ్‌ మల్హోత్రా న్యూజిల్యాండ్ తరపున బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించబడ్డారు. అంటే అర్థమయ్యిందా.. ఇల్లి అందంతో ఎత్తుగడ అని చెప్పడం కంటే అమెను ప్రచారకర్తగా వినియోగించుకుంటున్నారని చెబుతున్నామన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress  ileana  tourism fiji  brand ambassador  barfi  indian market  bollywood  entertainment  movies  

Other Articles