200 కోట్ల క్లబ్ లో ఓ సినిమా చేరడమంటే బాలీవుడ్ అయినా కొంత కష్టమే.. అయితే అలాంటిది రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఓ చిత్రం రూపొందుతుందంటే.. ఇక ఆ చిత్రంపై అంచనాలు ఎంతలా వుంటాయో ఏమోగానీ.. ఈ వార్తను వినడంతోనే ప్రేక్షకులు విస్మయానికి గురవుతున్నారు. విభిన్న చిత్రాలను రూపోందించడంలో అందవేసిన చేయిగా పేరొందిన దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడంటే.. తెలుగువారు మాత్రం సంతోషపడతున్నారు.
ఓ తెలుగు దర్శకుడు బాలీవుడ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. తన సత్తా చాటుకోవడం.. అందులోనూ భారీ బడ్జట్ చిత్రంలో నటించడం అంత అశామాశీ మాటేం కాదని అంటున్నారు. ఇటీవల బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని రూపోందించడతో ఆయనకు ఈ అవకాశం వచ్చి చేరిందని కూడా సినీవర్గాల టాక్. అయితే ఇది కూడా చారిత్రక నేపథ్యమున్న చిత్రమేనా..? అంటే అవుననే చెప్పాలి. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారంగా హిందీలో 'మణికర్ణిక' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను కంగనా రనౌత్ పోషిస్తోంది.
తాజాగా విడుదలైన ఆమె లుక్ కి భారీస్థాయిలో ప్రశంసలు దక్కుతుండటం విశేషం. అయితే ఈ చిత్రానికి 60 నుంచి 70 కోట్ల వరకూ ఖర్చుచేస్తూ ఉండొచ్చని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అని చెబుతూ అందరికీ షాక్ ఇచ్చింది కంగనా రనౌత్. ఒక టీవీ కార్యక్రమానికి హాజరైన ఆమె .. ఈ సినిమాను గురించి ప్రస్తావిస్తూ ఈ విషయం చెప్పింది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను 100 కోట్ల బడ్జెట్ లో చేయడానికే బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తారు. అలాంటిది 'మణికర్ణిక'కి ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టు కంగనా చెప్పడమే ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది.
కొద్ది రోజులుగా ఈ మూవీ జోథ్‌పూర్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. గురువారంతో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌లో మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. భారతీయ మహిళలందరు గర్వించేలా తీస్తున్న ఈ మూవీ పై కొందరు ప్రచారం కోసమే ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. అసలు వీరనారిపై ఇలాంటి విమర్శలేంటి. శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆమె చూపిన వీరపరాక్రమం గురించి సినిమాలో చూపిస్తున్నామని కంగనా అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more