sammohanam teaser going viral సమ్మోహింపజేస్తున్న టీజర్.. మరో ప్రేమకావ్యం..!

Sammohanam teaser sudheer babu and aditi rao starrer is all about love

Sudheer Babu, Aditi Rao Hydari, Vivek Sagar, sri devi movies, Sivalenka Krishna Prasad, Indraganti Mohan Krishna, sommohanam teaser, movies, tollywood, entertainment

National Award winning filmmaker, Indraganti Mohan Krishna’s upcoming film ‘Sammohanam’ stars Sudheer Babu and Aditi Rao Hydari in the lead. The makers recently unveiled the teaser of the film which is simply mesmerising.

సమ్మోహింపజేస్తున్న టీజర్.. మరో ప్రేమకావ్యం..!

Posted: 05/02/2018 04:58 PM IST
Sammohanam teaser sudheer babu and aditi rao starrer is all about love

‘శమంతకమణి’ తర్వాత యువ కథానాయకుడు సుధీర్‌బాబు నటిస్తున్న చిత్రం ‘సమ్మోహనం’. బాలీవుడ్‌ నటి అదితి రావు హైదరి కథానాయిక. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ బాణీలు అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తైంది.

కాగా తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సినిమా టీజర్ ను విడుదల చేశారు. దీన్ని సుధీర్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా టీజర్‌. కచ్చితంగా ఇది మీకు నచ్చుతుంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘సినిమా సాహిత్యం బతికే ఉంటాయ్‌’ అంటూ నటుడు నరేష్‌ డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ‘సాహిత్యం అన్నావు ఓకే.. కానీ సినిమా?.. హహ్హ హ్హ’ అని సుధీర్‌ నవ్వారు.

‘సో.. సినిమాలే డర్టీయా? మిగతా ప్రపంచం మొత్తం క్లీన్‌నా?’ అని అతిథి.. సుధీర్‌ను ప్రశ్నించారు. ‘నేను అలా చెప్పలేదు. ఈ అందం అంతా మెల్లమెల్లగా పోతుంది. చర్మం ముడతలు పడి, పళ్లు ఊడిపోయి, కాళ్లు వంగిపోయి, జుట్టు రాలిపోయి.. ఈ ముఖం వెనకాల వేరే ఒకళ్లు ఉన్నారు. ఒక వ్యక్తిత్వం.. అది నిజమైన నవ్వు, నిజమైన సమీరా. నాకు ఆ నిజమైన మనిషి కావాలి’ అని సుధీర్‌బాబు వివరించారు. ‘నేను కూడా కెరీర్‌ కోసం, సక్సెస్‌ కోసం కాంప్రమైజ్ అయ్యానంటావా?’ అంటూ అదితి డైలాగ్‌ తో ముగిసే టీజర్ ప్రేక్షకులను ఎమోషనల్ గా కదిలిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles