‘ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది. అది కనిపించదు.. కానీ, బతికిస్తుంది’ అంటున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పేపర్ బాయ్’. రియా సుమన్, తన్య హోప్ కథానాయికలు. జయ శంకర్ దర్శకుడు. సంపత్ నంది టీమ్ వర్స్క్ పతాకంపై సంపత్ నంది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది.
శనివారం ప్రసాద్ ల్యాబ్లో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. పుస్తకాలతో కథానాయకుడు, నాయిక ప్రేమ మొదలైనట్లు ఈ ప్రచార చిత్రంలో చూపించారు. ‘ధరణి.. నేను చదివిని మొట్ట మొదటి కవిత.. ఈ మూడు అక్షరాలు. నాకు పరిచయమైంది పుస్తకాలు, దగ్గరైంది అక్షరాలు’ అంటూ హీరో తన జీవితాన్ని పరిచయం చేశారు. ‘ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి ప్రపంచం ఒక్కలా ఉండదు అంటారు. కానీ, ఆ అక్షరాలు చూశాక మా ఇద్దరి ప్రపంచం ఒక్కటే అనిపించింది’ అని కథానాయిక తన మనసులో మాట చెబుతున్నారు.
‘ముద్దు పెట్టుకోవడం అంటే పెదాలు మార్చుకోవడం కాదు.. ఊపిరి మార్చుకోవడం’ అని హీరో భావోద్వేగంతో వివరిస్తూ కనిపించారు. ‘రేపటి నుంచి నీ కూతురు, వాడు సైకిల్ ఎక్కి పేపర్, పేపర్ అంటూ పేపర్ అమ్ముకోవాలి’ అంటూ పోసాని కోపంతో ఊగిపోతున్నారు. సంపన్న కుటుంబానికి చెందిన కథానాయికకి, పేద యువకుడైన కథానాయకుడికి మధ్య చిగురించిన ప్రేమ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more