RX 100 movie completes 50 days ‘‘ఆర్ఎక్స్ 100’’ కూడా పరుగులు పెడుతోంది..

Rx 100 movie completes 50 days in 26 centres

RX 100, karthikeya, Payal rajput, Ajay Bhupathi, box office, 50 days, tollywood, movies, entertainment

Tollywood hit movies are getting a old and golden days responce now a days. A Recent Hit movie RX 100 had hit the box office completing 50 days in 26 centers and running towards 100 days.

‘‘ఆర్ఎక్స్ 100’’ కూడా పరుగులు పెడుతోంది..

Posted: 08/31/2018 06:58 PM IST
Rx 100 movie completes 50 days in 26 centres

కార్తికేయ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో 'ఆర్ ఎక్స్ 100' చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంటెన్సివ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు మొదట నెగెటివ్ రివ్యూస్ వచ్చినా కేవలం మౌత్ టాక్ తో బ్లాక్ బస్టగా నిలిచి ఎంటైర్ టాలీవుడ్ ను సర్ ప్రైజ్ చేసింది. కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఏకంగా 14కోట్లకు పైగా బాక్సాఫీసు వద్ద వసూళ్లను రాబట్టి విమర్శకుల నోళ్లకు తాళాలు వేసింది.

జూలై 12వ తేదీన విడుదలైన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా తన కలెక్షన్లను రాబడుతూనే వుంది. యూత్ కి విపరీతంగా కనెక్ట్ కావడంతో అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కొత్త సినిమాలు చాలానే వచ్చినా, ఈ సినిమా వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మొత్తంగా ఈ సినిమాలో ఏముందీ అనుకున్నవారికి కూడా షాక్ ఇస్తూ ఇంకా తన జైత్రయాత్రను కొనసాగిస్తుంది.

ఫలితంగా ఈ సినిమా నిన్నటితో 50 రోజులను పూర్తిచేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో 26 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులను పూర్తిచేసుకోవడం పట్ల ఈ సినిమా టీమ్ ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తోంది. ఒక చిన్న సినిమా ఇన్నేసి థియేటర్స్ లో .. ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషమని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తరువాత దర్శకుడు అజయ్ భూపతికి .. హీరో కార్తికేయకి .. కథానాయిక పాయల్ రాజ్ పుత్ కి వరుస అవకాశాలు వస్తోన్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RX 100  karthikeya  Payal rajput  Ajay Bhupathi  box office  50 days  tollywood  

Other Articles