ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ముందుగా చెప్పినట్టుగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
'అనగనగనగా అరవిందట తన పేరు .. అందానికి సొంతూరు .. అందుకనే ఆ పొగరు, అరెరెరెరే .. అటు చూస్తే కుర్రాళ్లు .. అసలేమైపోతారు .. అన్యాయం కదా ఇది అనరే ఎవరూ .. ' అంటూ సీతారామ శాస్త్రి రాసిన ఈ లిరికల్ సాంగ్ కొనసాగుతుంది. తమన్ బాణీ .. అర్మాన్ మాలిక్ స్వరం కొత్తగా అనిపిస్తూ మనసుకు హత్తుకునేలా ఈ పాట వుంది. ఫస్టు సింగిల్ గా వచ్చిన ఈ లిరికల్ వీడియో .. సినిమాపై అంచనాలు పెంచడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుకను జరుపుకుని, దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more