మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను నెలకొల్పి ముందుకు దూసుకెళ్లిందన్న విషయం అందరీకీ తెలిసిందే. ఏకంగా రెండు వందల కోట్లకు పైగా ఆదాయాన్ని రాబట్టిన చిత్రంగానూ ఈ సినిమా నిలిచింది. అంతేకాదు ఏకంగా వందరోజుల పండుగను కూడా చేసుకున్న ఈ సినిమాపై తాజాగా అగ్రదర్శకుడు కే. రాఘవేంద్రరావు ప్రశంసలు కురిపించారు. ఓ కార్యక్రమంలో ఆయన తన మనస్సులోని బావాలను పంచుకున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
తాజాగా 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో ఆయన తన కెరియర్ కి సంబంధించిన ముచ్చట్లను పంచుకున్నారు. ఇదే సమయంలో ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. "తమిళ .. బెంగాలీ .. హిందీ భాషా చిత్రాల్లో జరుగుతోన్న ప్రయోగాలు తెలుగులో జరగడం లేదు. తెలుగు దర్శకులు ప్రయోగాలు చేయడానికి ముందుకు రావడం లేదనే విమర్శ కూడా వుంది .. ఈ విషయంపై మీరు ఏమంటారు?" అనే ప్రశ్న రాఘవేంద్రరావుకు ఎదురైంది.
అప్పుడు ఆయన స్పందిస్తూ .. "కొంతకాలం క్రితం వరకూ ఈ విమర్శ నిజమేనని అనుకోవచ్చు. కానీ ఇప్పుడొస్తోన్న యువ దర్శకులు చాలామంది కొత్తగా ఆలోచిస్తున్నారు .. డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తూ వెళుతున్నారు. చరణ్ లాంటి హీరోను చెవిటివాడిగా చూపించాలంటే మేమంతా భయపడేవాళ్లం. కానీ సుకుమార్ అద్భుతంగా ఆ పాయింట్ ను హ్యాండిల్ చేశాడు. ఇక ఇమేజ్ ను పక్కన పెట్టేసి హీరోలు ముందుకురావడం కూడా మంచి పరిణామం" అని చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more