‘2.ఓ’ సినిమాతో తన కల నిజమైందని ప్రముఖ దర్శకుడు శంకర్ అన్నారు. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ హీరోగా, ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించడంతో ఈ చిత్రం పట్ల అభిమానుల్లో మరింత హైప్ పెంచిందని అన్నారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. 4డీ సౌండ్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, థియేటర్లలో సీటు కింద స్పీకర్ ఉన్న భావన ప్రేక్షకుడికి కలుగుతుందని అన్నారు.
ఇది తన కలని, ఇప్పుడు సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి సహాయంతో అది నిజమైందని శంకర్ ఆనందం వ్యక్తం చేశారు. అంతకుముందు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ మాట్లాడుతూ..‘నా అభిమాన నటుడు రజనీకాంత్. ఆయన అందరికీ స్ఫూర్తి. ఈ వయసులోనూ ఆయన వృత్తిపట్ల చూపించే అంకితభావం నన్నెంతో మెప్పించింది. ఈ సినిమా కోసం ఆయన 18 కిలోల బరువున్న సూట్ ధరించారని అన్నారు
ట్రైలర్ లాంచ్ సందర్భంగా చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు శంకర్ కేవలం దర్శకుడు మాత్రమే కాదని, ఆన గొప్ప శాస్త్రవేత్త కూడా అంటూ కితాబిచ్చారు. సినిమా షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు అక్షయ్. ఈ సినిమా కోసం అనేక సవాళ్లు ఎదుర్కొన్నా అని అన్నారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్, హీరో రజనీకాంత్ లకు ధన్యవాదాలు తెలిపారు.
తన 28 ఏళ్ల సినీ కెరీర్లో వేసుకున్న మొత్తం మేకప్ ఈ ఒక్క సినిమాలో వేసుకున్నా. మేకప్ తర్వాత ఆ పాత్రలో తనను తాను చూసుకుని షాకైపోయానని అన్నారు. మేకప్ వేసుకోవడం కోసం మూడు గంటల సమయం పడితే, తీయడానికి గంటన్నర సమయం పట్టేదని చెప్పారు. ఓ చారిత్రక చిత్రం కోసం పనిచేసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
మొదట 2డీలో తీసి 3డీలో మార్చితే ఆ ప్రభావం కనిపించదు. అందుకే 3డీలో తెరకెక్కించాం. త్రీడీలో తీయడం కూడా చాలా కష్టం. శంకర్ తో పనిచేయడం వల్ల ఎంతో అనుభవం వచ్చింది. ఇది చాలా పెద్ద ప్రక్రియ అందుకే సినిమా ఆలస్యమైంది. మీలాగానే నేను కూడా పెద్ద స్క్రీన్‌పై చూడాలని అనుకుంటున్నానని కెమెరామెన్ నీరవ్ షా అన్నారు.
‘ఇది ఒక తమిళ, తెలుగు, హిందీ చిత్రం కాదు.. ఇది ఒక భారతీయ చిత్రం. కొత్త విషయాల కోసం ఎప్పుడూ మనం హాలీవుడ్ సినిమాలపైనే చూస్తాం. కానీ శంకర్ ఒక కొత్త చరిత్ర సృష్టించారు. చాలా గర్వంగా ఉంది. ఈ చిత్రంలో ఒక సరికొత్త సౌండ్‌ను తీసుకొచ్చాం. శంకర్ విజన్, లైకా ప్రొడక్షన్స్ నమ్మకం ఇందులో ఉన్నాయి. మేము కేవలం ఒక వారధిలాంటి వాళ్లమే. ఇందులో భాగస్వాములైమైనందుకు చాలా సంతోషంగా ఉంది. సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more