RGV controversial comments on farmers రైతులంటే చిరాకు.. మట్టంటే అసహ్యం: అర్జీవి

Ram gopal varma sensational comments on farmers

ram gopal varma sensational comments on farmers, RGV controversial comments on farmers, Ram gopal varma, bhairavageeta, sidharth tatholu, farmers, mud, rgv controversy

Famous director ram gopal varma controversial comments on farmers, says he hates farmers and mudRGV controversial comments on farmers రైతులంటే చిరాకు.. మట్టంటే అసహ్యం: అర్జీవి

రైతులంటే చిరాకు.. మట్టంటే అసహ్యం: అర్జీవి

Posted: 12/15/2018 03:18 PM IST
Ram gopal varma sensational comments on farmers

‘నాకు అస్సలు సామాజిక బాధ్యత లేదు.. సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ అస్సలు లేదు. నాకు నచ్చినట్టు నేనుంటా.. తోచినట్టుగా సినిమా తీస్తా.. మీకు నచ్చకపోతే నా సినిమాలు చూడటం మానేయండి అంతే తప్ప సొసైటీ, పీపుల్స్, రెస్పాన్సిబిలిటీ.. ఇలాంటి కాకమ్మ కథలు నా దగ్గర చెప్పకండి.. నేను వినను’ అని చెప్పే రామ్ గోపాల్ వర్మ.. మరోమారు అహంభావపూరిత వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు సిద్దార్థ్ తాతోలు రూపోందించి ‘భైరవగీత’ అనే ఫ్యాక్షన్ ప్రేమకథా చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు  వర్మ.

ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవి రైతులను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఏదోఒక వివాదానికి తెరతీసే వర్మ..దేశానికి అన్నం పెట్టే రైతు అంటే తనకు చిరాకు అంటూ కామెంట్స్ చేశారు. రైతులపై సినిమా తీస్తే.. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన వారు అవుతారు’ అని అన్న ప్రశ్నపై ‘నాకు రైతులంటే చిరాకు.. వాళ్లు ఎప్పుడూ మట్టిలోనే ఉంటారు. నాకు మట్టి అంటే అసహ్యం అందుకే రైతులపై సినిమాలు తీయను. నాకు ఎప్పుడూ.. గన్‌లు, కత్తులు ఇవంటేనే ఇష్టం. వాటిపైనే సినిమాలు తీస్తా.. ఒకవేళ రైతులు తుపాకులు, కత్తులు పట్టుకుంటే అప్పుడు ఆలోచిస్తా’ అంటూ వ్యగ్యంగా స్పందించారు రామ్ గోపాల్ వర్మ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram gopal varma  bhairavageeta  sidharth tatholu  farmers  mud  rgv controversy  

Other Articles