118 Teaser: Stylish suspense thriller 118 టీజర్ తో సస్పెన్స్ పెడుతున్న కల్యాణ్ రామ్..

118 teaser kalyan ram promises an engaging thriller

118 Teaser, Kalyan Ram, Nandamuri Kalyan Ram, Shalini Pandey, Nivetha Thomas, 118 film, 118 release date, 118 music composer, tollywood, movies, entertainment

Nandamuri Kalyan Ram's last film NaaNuvve, starring Tamannaah in the lead female role, was a box office failure. Looks like Kalyan Ram is making a fierce comeback with his upcoming film 118.

118 టీజర్ తో సస్పెన్స్ పెడుతున్న కల్యాణ్ రామ్..

Posted: 12/18/2018 08:09 PM IST
118 teaser kalyan ram promises an engaging thriller

టాలీవుడ్ ‘పటాస్’ నందమూరి కల్యాణ్ రామ్ ‘118’ అనే థ్రిల్లర్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నివేతా థామస్, షాలినీపాండే హీరోయిన్లు గా ఈ మూవీలో నటిస్తున్నారు. ఇవాళ 118 మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ తోనే ఏదో మిస్టీరియస్ ఫీల్ తెప్పించిన 118 మూవీ… టీజర్ తో ఆ క్యూరియాసిటీని మరింత పెంచేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతోందన్న సంగతిని… టీజర్ తో మరోసారి క్లారిఫై చేసేశారు.

టీజర్ ను చూస్తే… కల్యాణ్ రామ్, షాలినీపాండే ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తుంటారు. ‘ఆ రోజ్ వరకు’ అనే బ్యాంగ్ తో… టీజర్ లో వేరియేషన్ వస్తుంది.  ఓ అర్ధరాత్రి వాళ్ల లైఫ్ ను మార్చేస్తుంది. తన జీవితం, తనవాళ్ల జీవితానికి షాకిచ్చిన ఓ విషయం గురించి కల్యాణ్ రామ్ వెతుకుతుంటాడు. 1:18 సమయం బ్లింక్ అవుతుంది. ఆ సమయానికి… సినిమా టైటిల్ కు లింక్ ఉంటుందన్న సంగతి అర్థమవుతుంది. ఆ మిస్టరీ ఏంటన్నదే మూవీపై ఆసక్తి పెంచుతోంది.

టీజర్ లో నివేతా థామస్ ను చూపించలేదు. నివేతాది చాలా ఇంపార్టెంట్ రోల్ అని చిత్రయూనిట్ చెబుతోంది. శేఖర్ చంద్ర టీజర్ లో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ బాగుంది. కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. మహేశ్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు.

 
 
 
 
 
 
 

 

 
 
 
 
 
 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 118 Teaser  Kalyan Ram  Shalini Pandey  Nivetha Thomas  tollywood  

Other Articles