Lakshmi’s NTR Artist hails from AP ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ముఖ్యపాత్రధారి మనోడేనట

Ramgopal varma s lakshmi s ntr artist hails from ap

NTR in Lakshmi's NTR, RGV, West Godavari, Drama Arstist, Training, NTR Becomes Alive, Lakshmi’s NTR, NTR First Look, Ram Gopal Varma, Kalyani Malik, Rakesh Reddy, GV Films, SriKrishna, SiraSri, Vennupotu, movies, entertainment, tollywood

NTR Role Artist in Lakshmi’s NTR is a Local Artist reveals director Ram Gopal Varma. He says the NTR role artist is an Drama Artist who hails from Andhra pradesh West Godavari.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ముఖ్యపాత్రధారి మనోడేనట

Posted: 01/19/2019 06:47 PM IST
Ramgopal varma s lakshmi s ntr artist hails from ap

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రాజెక్టులో కీలకమైన ఎన్టీఆర్ పాత్ర పోషించిన నటుడు ఎవరా.? అన్న సందేహాలు నిన్న సాయంత్రం ఐదు గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉత్పన్నం అవుతున్నాయి. అసలు ఎన్టీఆర్ పాత్రధారి ఎలా వుంటుందన్న ఉత్కంఠకు తెరదించిన అర్జీవి.. ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ఒక్కసారిగా లక్ష్మిస్ ఎన్టీఆర్ క్లిక్ అయ్యేలా చేశాడు.

ఆర్జీవి విడుదల చేసిన ఎన్టీఆర్ లుక్ ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతోంది. చిన్న క్లిప్ 12 గంటల్లోనే యూ ట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. ఈ కాంట్రవర్సీ సినిమా విడుదలయ్యాక ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో గాని ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.


ఇక ఎన్టీఆర్ పాత్రలో కనిపించిన వ్యక్తిని వర్మ వెస్ట్ గోదావరి నుంచి తెప్పించినట్లు చెప్పాడు. అతను ఒక థియేటర్ ఆర్టిస్ట్ అని అయితే కొన్ని నెలల పాటు నటనపై శిక్షణను ఇచ్చి సినిమాకు తగ్గట్లుగా లుక్ ని మార్చినట్లు వర్మ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఎన్టీఆర్ హావభావాలు మాడ్లాతే విధానం అన్ని విషయాల్లో స్ట్రాంగ్ ట్రైనింగ్ ఇచ్చి వర్మ సినిమా కోసం సిద్ధం చేసినట్లు చెప్పాడు.

ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కనిపించిన ఎన్టీఆర్ గురించి ఇంతకంటే లోతుగా వివరాలను బయటపెట్టడం లేదు. సాధారణంగా వర్మ తన సినిమాలో నటీనటులను నార్త్ నుంచి తెచ్చుకుంటాడు. గతంలో రక్త చరిత్ర సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కోసం హిందీ యాక్టర్ శత్రుఘన్ సిన్హా ను తీసుకున్నాడు. ఇక ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కనిపిస్తోంది మనోడే అని వర్మ తెలియజేశాడు. మరి మనోడు అన్నగారిలా ఎలా ప్రేక్షకులను అకట్టుకుంటాడో చూడాలి మరి..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR in Lakshmi's NTR  RGV  West Godavari  Drama Arstist  Training  tollywood  

Other Articles