మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని చిత్రం రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిడంతో పాటు ఏకంగా చాలాకాలం తరువాత శతజయంతోత్సవాన్ని జరుపుకున్న తెలుగుచిత్రంగా కూడా రికార్డు పుట్టలకెక్కింది. అలాంటి ఈ చిత్రం ఇక త్వరలో శాండల్ వుడ్ లో కూడా చరిత్రను తిరగరాసేందుకు సన్నధమయ్యింది.
చెవిటివాడిగా రామ్ చరణ్ నటన ఈ సినిమాకి హైలైట్ గా మారింది. 120 కోట్ల షేర్ ను రాబట్టి ఈ చిత్రం టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేస్తూ, నాన్ బాహుబలి జాబితాలో మొట్టమొదటి స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు వేరే భాష ప్రేక్షకుల వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తాజా సమాచారం ప్రకారం 'రంగస్థలం' సినిమా మలయాళం, కన్నడ మరియు తమిళ భాషల్లో విడుదల కానుంది.
ఈ సినిమా త్వరలోనే ఈ నెలలోనే విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. తెలుగు సినిమాలు తమిళ, మలయాళ భాషల్లో డబ్ అవ్వడం ఎప్పుడు జరిగే పనే కానీ కన్నడలో మాత్రం ఇది రేర్ అని చెప్పుకోవచ్చు. మరి తెలుగు ప్రేక్షకులను బీభత్సంగా బాగా మెప్పించిన ఈ సినిమా మిగతా మూడు భాషల్లో ప్రేక్షకులను ఎంతవరకూ అలరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ డ్రామా లో సమంత హీరోయిన్ గా నటించగా, ఆది పినిశెట్టి మరియు ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more