నాగ్ అశ్విన్ దర్శకుడిగా రెండేళ్ల పాటు కష్టపడి పాతకాలం నాటి దిగ్గజ నటి సావిత్రి జీవిత కథ పై రీసర్చ్ చేసి అమె జీవితాన్ని తెరపై రూపొందించిన ‘మహానటి’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. ఈ చిత్రం తెలుగురాష్ట్రాలలో విడుదలై బాక్సాఫీసు వద్ద రికార్డులను కొల్లగొట్టడంతో పాటు అలనాటి నటి తెరవెనుక జీవితాన్ని కూడా అవిష్కరించడంలో దర్శకుడు నాగ్ అశ్విన్ మంచి మార్కులే సాధించాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఇప్పటికీ గూడకట్టుకున్న మహానటులపై అభిమానాన్ని ఆయన తట్టిలేపాడు.
ఇప్పటికే ఈ చిత్రం భారతీయ అంతర్జాతయ ఫిల్మ్ పెస్టివల్ తో పాటు మెల్ బొర్న్ ఫిల్మ్ పెస్టివల్ లో కూడా ప్రదర్శింపబడి ప్రేక్షకులు మనన్నలను అందుకుంది. కాగా తాజాగా ఈ చిత్రం మరో ఘనతను కూడా అందుకుంది. జూన్ 15 నుంచి 24 వరకు నిర్వహించనున్న 22వ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (ఎస్ఐఎఫ్ఎఫ్)కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా ఇది రికార్డులకెక్కింది. ‘ఇంటర్నేషనల్ పనోరమ' విభాగంలో ఈ సినిమాను ఎంపిక చేశారు.
ఫిలిం ఫెస్టివల్లో భాగంగా మెయిన్ల్యాండ్ చైనాలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. వైజయంతీ మూవీస్- స్వప్న సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటి కీర్తి సురేశ్ టైటిల్ పాత్రలో నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ సహా దక్షిణాది స్టార్స్ అందరూ ఈ చిత్రంలో నటించారు. గతేడాది మే 9న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ లభించింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more