chiranjeevi relation-ship with dasari దాసరి నాకు వరుసకు.. రిలేషన్ చెప్పిన చిరు

Chiranjeevi relation ship with dasari narayana rao

Chiranjeevi, Chiranjeevi Shocking Comments On Dasari Narayana Rao, chiranjeevi dasari narayana rao relationship, Dasari Narayana Rao, Directors Day Special Program, film news, tollywood latest news, tollywood latest videos, movies, entertainment, tollywood

Tollywood megastar chiranjeevi opens-up on the relation-ship between him and late legend director dasari narayana rao.

దాసరి నాకు వరుసకు.. రిలేషన్ చెప్పిన చిరు

Posted: 05/06/2019 07:44 PM IST
Chiranjeevi relation ship with dasari narayana rao

మెగాస్టార్ చిరంజీవికి ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణరావుకు మధ్య వున్న రిలేషన్ షిప్ ఏమిటో తెలుసా.? వారిద్దరూ వరుసకు బంధువులు అవుతారన్న విషయం టాలీవుడ్ లో చాలా మందికి తెలియదు. అసలు వారిద్దరూ వరుసకు ఏమవుతారో తెలుసా..? ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ప్రకటించారు. దాసరినారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్ట‌ర్స్ డేగా అని ప్ర‌క‌టించి సెల‌బ్రేట్ చేసుకుంటున్న వేడుకలోనే చిరంజీవి హాజరై తమ మధ్య వున్న రిలేషన్ ఏంటో చెప్పారు.
 
దాస‌రి నారాయణతో తనకు సినిమాల కంటే వ్య‌క్తిగ‌తంగా మంచి అనుబంధం ఉంది. చివ‌రి రోజుల్లో ఆ అనుబంధం మ‌రింత బ‌లంగా మారిందని ఆయన చెప్పారు. చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే అంటూ వారిద్దరి మధ్య వున్న బంధుత్వాన్ని చెప్పారు. తనకు, దాసరి నారాయణరావు వ‌రుస‌కు తాత అవుతారని చెప్పారు. ఈ విష‌యాన్ని దాస‌రిగారు చాలా సంద‌ర్భాల్లో చెప్పారు కూడా. నా 150వ చిత్రం `ఖైదీ నంబ‌ర్ 150`కి విజ‌య‌వాడ వ‌చ్చి న‌న్ను ఆశీర్వ‌దించారని చెప్పారు. అల్లు రామ‌లింగ‌య్య అవార్డుని తాను స్వ‌యంగా ఆయ‌న ఇంటికి తీసుకు వెళ్లి అంద‌జేశాన అని చిరంజీవి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles