Saaho trailer promises an action extravaganza ప్రభాస్ సాహో నుంచి ట్రైయిలర్ వచ్చేసిందహో.!

Saaho trailer out prabhas and shraddha kapoor pack a powerful punch

Saaho Trailer, saaho trailer out, saaho trailer release, saaho trailer release time, saaho trailer launch, saaho action trailer, bahubali saaho trailer, Prabhas, Shraddha Kapoor, Sujeeth, Neil Nitin Mukesh, Tollywood, Movies, Entertainment

Saaho is one of the most anticipated Indian films in recent times, thanks to its ensemble cast and extravagant visuals. Directed by Sujeeth, the spy thriller features Prabhas, Shraddha Kapoor and Neil Nitin Mukesh in the lead roles.

ప్రభాస్ సాహో నుంచి ట్రైయిలర్ వచ్చేసిందహో.!

Posted: 08/10/2019 09:13 PM IST
Saaho trailer out prabhas and shraddha kapoor pack a powerful punch

‘సాహో’ వచ్చాడు.. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సాహో’ ట్రైలర్ భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో శనివారం నాడు విడుదలైంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఒళ్లు గగుర్పొ డిచే యాక్షన్ సన్నివేశాలు.. అబ్బురపరిచే సాహస విన్యాసాలు.. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలపించే హై టెక్నికల్ వాల్యూస్‌‌తో హై వోల్టేజ్ క్రియేట్ చేసేలా ఈ ట్రైలర్‌ను రూపొందించారు దర్శకుడు సుజీత్.

డార్లింగ్ ప్రభాస్.. స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తుంటే.. హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ గ్లామర్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొడుతుంది. మందిరా బేడీ ,ఇవాలియన్ శర్మ, మురళీశర్మ, జాకీ ష్రాఫ్, తిన్ను ఆనంద్, మంజ్రేకర్ మహేష్, లాల్ తదితరులు క్యారెక్టర్‌‌లను రివీల్ చేశారు. సుజిత్ డైరెక్షన్‌కి ప్రముఖ హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్ కెన్నీ బటీస్ అద్భుత యాక్షన్ సన్నివేశాలు తోడు కావడంతో ‘సాహో’ హాలీవుడ్ మూవీని తలపిస్తోంది.

ప్రభాస్ ఇమేజ్‌ను తగ్గట్లుగా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని సుమారు రూ. 250 కోట్లతో యూవీ క్రియేషన్స్‌లో వంశీ, ప్రమోద్, విక్కీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించారు. ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడితో కంపోజ్ చేయిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సైకో సైయా’, ‘ఏ చోట నువ్వువున్నా’ సాంగ్స్‌కి మిశ్రమ స్పందన లభిస్తోంది. తాజాగా విడుదలైన ‘సాహో’ ట్రైలర్‌లో ఎన్ని మిలియన్ వ్యూస్‌లో రికార్డుల జాబితాలో చేరుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saaho Trailer  Prabhas  Shraddha Kapoor  Sujeeth  Neil Nitin Mukesh  Tollywood  

Other Articles