చిరంజీవి కెరియర్లో తొలి చారిత్రక చిత్రంగా రూపొందిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం, వచ్చేనెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనున్న ఈ చిత్రం మెగా అభిమానులకు మంచి సర్ ప్రైజ్ కూడా ఇవ్వనుందన్న టాక్ వినిపిస్తోంది. అదేంటి సినిమా రమారమి పూర్తై.. మరో రెండు వారాల్లో విడుదలకు సిద్దంగా వున్న ఈ తరుణంలో సర్ ప్రైజ్ ఏంటీ అని అలోచిస్తున్నారా.?
సర్ ప్రైజ్ ఏంటంటే.. తన సుదీర్ఘ సినీ కెరీర్ లో చిత్రల పరిమితిని బట్టి పలు చిత్రాలలో ద్విపాత్రాభినయంతో మెప్పించిన మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రంలోనూ అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ ద్విపాత్రాభినయంలో మెప్పించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. తొలిసారి ఆయన ‘నకిలీ మనిషి’ సినిమాలో హీరో కమ్ విలన్గా ద్విపాత్రాభినయం చేశారు. ఆ తరువాత బిల్లా రంగాలో తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో మెప్పించిన చిరు ‘రోషగాడు’ సినిమాలోనూ ద్విపాత్రాభినయం చేసి మెరిసాడు.
ఆ తరువాత ‘సింహపురి సింహం’లో మెగాస్టార్ డ్యూయల్ రోల్ చేశారు. ‘జ్వాలా’లో అన్నదమ్ములుగా కనిపించిన చిరుంజీవి.. రక్త సింధూరంలో చిరంజీవిలోనూ అదే ఫార్ములాను కథ డిమాండ్ చేయడంతో అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. ఆ తరువాత ‘దొంగమొగుడు’లో రెండు పాత్రల్లో మెప్పించారు చిరంజీవి.. యముడికి మొగుడు సినిమాలోనూ కాళీ, బాలుగా రెండు పాత్రల్లో మెప్పించారు. ఇదే తరహాలో అటు ‘రౌడీ అల్లుడు లో ఆటోజానీగా, కళ్యాణ్ గా డ్యూయల రోల్ లో నటించారు. ఇక అభిమానులకు అంతకన్నా మరంత అధిక సర్ ప్రైజ్ ఇస్తూ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ‘రిక్షావోడు’తండ్రి కొడుకులుగా చిరు ద్విపాత్రాభినయం చేసిన చిరు.. ‘స్నేహం కోసం’లో మరోసారి తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటించారు.
ఆ తరువాత అందరివాడులో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన మెగాస్టార్ దాదాపు పది సంవత్సరాల తరువాత రీ-ఎంట్రీతో మళ్లీ టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన చిరంజీవి.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆయన 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లోనూ డ్యూయల్ రోల్ చేసిన చిరంజీవి ఇక తాజాగా తన సినీకెరీర్ లో తొలి చారిత్రక చిత్రంగా.. భారీ బడ్జెట్ తో రూపోందుతున్న సైరా నరసింహరెడ్డి చిత్రంలోనూ ఆయన ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమన్న విషయం తెలియడానికి గాంధీ జయంతి వరకు వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more