Vijay fans vandalise property in Tamil Nadu హద్దులు దాటిన హీరో విజయ్ అభిమానులు..

Bigil vijay fans go on rampage protesting krishnagiri theatres

aiadmk, Bigil, diwali, vandals, Vijay fans, Hero Vijay, Krishnagiri, vandalise Theatres, vijay fans rampage, fans ruckus, Tamil Nadu, Crime news

Angry over the time change, Vijay fans lost patients and began to break barricades, boards and started burning the banners and flags they brought along with them and some even began pelting stones.

హద్దులు దాటిన హీరో విజయ్ అభిమానులు..

Posted: 10/25/2019 07:02 PM IST
Bigil vijay fans go on rampage protesting krishnagiri theatres

తమిళనాడులో హీరో విజయ్ నటించిన బిగిల్ చిత్రం విడుదల నేపథ్యంలో ఆయన అభిమానులు హద్దులు దాటారు. తమ హీరో చిత్రాన్ని ప్రత్యేక షో ప్రదర్శించని ఓ థియేటర్‌ వద్ద హీరో విజయ్‌ అభిమానులు బీభత్సం సృష్టించారు. విజయ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బిగిల్‌’. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక. శుక్రవారం ‘బిగిల్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే తమ అభిమాన హీరో కొత్త సినిమా స్పెషల్‌ షో వేయలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అభిమానులు కృష్ణగిరిలోని ఓ థియేటర్‌ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా థియేటర్‌ ఆవరణలో ఉన్న దుకాణాలకు నిప్పు పెట్టారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌తో పాటు పోలీస్‌, మున్సిపల్‌ వాహనాలను సైతం ధ్వంసం చేశారు. ‘బిగిల్‌’ స్పెషల్‌ షో వేసేవరకు వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు.

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అభిమానులపై లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా హింసకు పాల్పడిన 37 మందిని గుర్తించి అరెస్టు చేశారు. ‘బిగిల్‌’ సినిమా స్పెషల్‌ షోలకు అనుమతివ్వడంలో జాప్యం చేసిన తమిళనాడు ప్రభుత్వం గురువారం సాయత్రం అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చినా సరే థియేటర్లలో ‘బిగిల్‌’ స్పెషల్‌ షోను ప్రదర్శించక పోవడంతో అసహనానికి గురైన అభిమానులు దాడికి పాల్పడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles