Kangana in the role of Jayalalithaa.. కంగనా ఎంత మురిపించి - మరిపిస్తుందో జయలలిత గారి పాత్రలో..

Kangana in the role of jayalalithaa

Actress Kangana Ranaut, Jayalalithaa Biopic, Thalaivi Movie, Bollywood, Tamil Language, Kangana Ranaut

The Bollywood Actress Kangana Ranaut has busy in learning Tamil for the Jayalalithaa Biopic Thalaivi Movie.

కంగనా ఎంత మురిపించి - మరిపిస్తుందో జయలలిత గారి పాత్రలో..

Posted: 11/15/2019 04:17 PM IST
Kangana in the role of jayalalithaa

తమిళనాడు ముఖ్యమంత్రి తమిళవాసుల పాలిట అమ్మగా సేవలు అందించిన జయలలిత గారి జీవిత చరిత్రను తెర మీదకు రాబోతున్నా సంగతి మన అందరికి తెలిసిన విషయమే. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో తలైవిగా మన ముందుకు రాబోతున్నది. ఈ చిత్రంలో జయ లిలిత గారి పాత్రను బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గారు పోషించ నున్నారు. ఈ మధ్య కాలంలోనే ఈ సినిమా ప్రారంభం మొదలైనది. ఒక నాలుగు నెలల పాటు సినిమా నిర్మాణ పూర్వ పనులకే ప్రత్యేక శ్రద్ధ వహించారు.

ఈ సినిమా ఎంతో ప్రతిష్ఠాతకమైనది. తమిళవాసుల ఆరాధ్య దైవం అయినా అమ్మ జయ లలిత గారి జీవిత కథ ఆదారంగా తెరకెక్కుతున్నా చిత్రం. అభిమానులలో ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు.. అప్పుడే పెరిగిపోయాయి. ఈ సినిమాకి గాను కంగనా గారు కొంత బరువు పెరిగినట్టు తెలుస్తుంది. అంతే కాక జయలలిత గారి హావ భావాలను మరియు ఆమె యాస - భాషలను నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. 

తమిళ భాషను నేర్చుకున్నే పనిలో పడ్డారు కంగనా. తమిళ భాష అంత సరళమైనది కానే కాదు. చాల కష్టంతో కూడు కున్నది అని ఈ భామ సెలవిచ్చారు. అంతే కాక చాల కష్టపడి డైలాగ్స్ కంఠస్థం చేస్తున్నాను. ఈ డైలాగ్స్ సినిమాకి కీలకం కానున్నాయి అని తెలిపారు. ఇంతక ముందు ఒకసారి తమిళం నేర్చుకోవాలని ఆశ పడ్డాను కానీ కుదరలేదు. అది ఈ సినిమా మూలంగానైనా తమిళం నేర్చుకోగల్గుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా దక్షిణ భాషలతో పాటు హిందీ భాష లో కూడా విడుదల కానున్నది. కంగనా ఎంత మురిపించి - మరిపిస్తుందో జయలలిత గారి పాత్రలో.

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  Jayalalithaa Biopic  Thalaivi  

Other Articles