Drunk actor slapped Rs 5,000 fine టాలీవుడ్ నటుడికి జరిమానా విధించిన కోర్టు.. ఎందుకు.?

Kukatpally court fined rs 5 000 on tollywood actor prince sushanth

Prince Sushanth, Drunken Driving, VNR College, Bachupally, IV Metropolitan Magistrate Special Court, Kukatpally, Hyderabad, Telangana, Crime

Tollywood actor Prince Sushanth attended to Kukatpally court in a drunken drive case registered on him. The court imposed fine of Rs 5,000 on him. Earlier on November 24 police caught him at VNR College in Bachupally during the drunken drive tests and booked a case against him.

టాలీవుడ్ నటుడికి జరిమానా విధించిన కోర్టు.? ఎందుకు

Posted: 11/27/2019 12:29 PM IST
Kukatpally court fined rs 5 000 on tollywood actor prince sushanth

రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న మందుబాబులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడిక్కడ డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ మందుబాబుల్లో పెద్దగా మార్పు రావడం లేదు. అందులోనూ బాడాబాబులకు మరీనూ. తాగేస్తాం.. నడిపేస్తాం.. అంటూ చెలరేగిపోతున్నారు. తాజాగా డ్రంక్ అండ్డ్రైవ్ కేసులో టాలీవుడ్ హీరో పోలీసులకు చిక్కాడు. అయినా ఈ వార్త మీడియాకు తెలియలేదు. ఆయన కౌన్సిలింగ్ కు హాజరైన తరువాత న్యాయస్థానానికి వచ్చి జరిమానా చెల్లించేప్పుడు మాత్రం మీడియాను తప్పించుకోలేకపోయారు.

ఇంతకీ ఎవరా హీరో అంటే.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో ప్రిన్స్ సుశాంత్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆయనకు న్యాయస్థానం జరిమానా విధించింది. దానిని చెల్లించేందుకు ఆయన న్యాయస్థానానికి చేరుకోవడంతో విషయం మీడియాకు తెలిసింది. అంతే ఇంకేముందు విషయం తెలుగు చిత్ర ప్రేక్షకులకు తెలిసిపోయింది. గత నెల 24న డ్రంక్ అండ్ డ్రైవ్ లో సుశాంత్ పోలీసులకు పట్టుబడ్డాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో అతడికి 48 పాయింట్లు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో సుశాంత్ కూకట్ పల్లి కోర్టుకు హాజరయ్యారు. అతడికి న్యాయమూర్తి 5వేల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చారు. కాగా 'నీకు నాకు డ్యాష్ డ్యాష్' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ప్రిన్స్.. 'బస్టాప్', 'నేను శైలజ', 'రొమాన్స్', 'మిస్టర్' వంటి చిత్రాల్లో కనిపించాడు. అలాగే 'బిగ్‌బాస్‌' మొదటి సీజన్‌లోనూ పాల్గొన్నాడు. ప్రస్తుతం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు ప్రిన్స్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles