Bindu Madhavi hopes all over on 'Mayan' బిందు మాధవి ఆశలన్నీ 'మాయన్' పైనే

Bindu madhavi hopes all over on mayan

Actress Bindu Madhavi, Kollywood, Mayan Movie, Tollywood News

Actress Bindu Madhavi hopes all over on the horror movie 'Mayan'

బిందు మాధవి ఆశలన్నీ “మాయన్“ పైనే

Posted: 12/26/2019 07:12 PM IST
Bindu madhavi hopes all over on mayan

మన తెలుగు సోయగం ఎక్కడ విరసినా అక్కడ సుగంధ పరిమళపు ఆవిరే. ఈ పదానికి తగట్టుగా మన పదహారణాల తెలుగు సోయగం తమిళ దేశ అంచులలో తన నటన లావణ్యతను  ప్రదర్శిస్తుంది. తెలుగు లో సరి అయినా అవకాశాలు లేక, వచ్చిన అవకాశాలలో అదృష్టం కలిసి రాక పక్క రాష్ట్రాల పై కన్నేసింది ఈ సొగసరి. చిట్ట చివరగా అక్కడ విజయ సందేశం అందుకుంది. ఆవకాయ బిర్యానీ  మరియు బంపర్ ఆఫర్లా విజయాలు తన కు ఏ మాత్రం సాయ పడలేదు.

టాలీవుడ్ నుండి కోలీవుడ్ లో పయనం సాఫీగా సాగింది. చక్కనైన ముద్దుగుమ్మా బిగ్గబోస్ లో కూడా తళుకున్న మెరిసింది. ఆ తరవాత ఆమెకు బానే కలిసి వచ్చింది. పలు చిత్రాలతో మన ముందుకు రాబోతున్నది త్వరలో. మాయన్ అనే హారర్ ఫాంటసీ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు బిందు మాధవీ పెట్టుకుంది. ఈ చిత్ర విజయంతో నైనా తన నటనలో సరికొత్త పంధా తొక్కాలని ఆశ పడుతున్నది. రాజేష్ కన్నా ఈ చిత్రానికి దర్శక చర్యలు తీసుకున్నారు. అంతేకాక మలేషియా నటుడు వినోద్ మోహన్, బిందు మాధవి కి జోడి గా కనపడనున్నారు.

శివుడు మరియు మాంత్రికులా నడుమ జరిగే కథాంశంతో  తెరకెక్కనున్నది ఈ చిత్రం. అన్ని వర్గా ప్రజలను ఎంతో ఆసక్తితో చిన్న పెద్ద తేడా లేక అందర్నీ ఆకట్టుకుంటుంది అన్ని చిత్ర బృందం అంతో ఆనందంగా పేర్కొన్నది. ఇది లా ఉంటె ఈ చిత్రంలో ఒక పాటను నటుడు శింబు ఆలపించారు. తన సంగీతంతో మన కుర్రగాళ్ల హృదయాలను దోచుకుంటున్న అనిరుధ ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ ని ఆవిష్కరించారు. ఆంతేకాక పలు ముఖ్య తారాగణంతో ఈ చిత్రం మరింత కళాత్మకంగా మన ముందుకు రానున్నది. అందాల భామ బిందు మాధవి గారి ఆలోచనలు అన్ని ఈ చిత్రం పైనే. వేచి చూడాలి విజయం వారించెనో లేదో ఈ “మాయన్“ వల్ల.

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bindu Madhavi  Mayan Movie  

Other Articles