అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు వద్ద తెగ సవ్వడి చేస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 220 కోట్ల క్లబ్ లో చేరి దుమ్మురేపుతోంది. అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం పది రోజులైనా ఏమాత్రం జోరును తగ్గకుండా దూసుకెళ్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ సందడి చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లు (గ్రాస్) రాబట్టిందని, ఇది ఆల్ టైమ్ రికార్డని చిత్రయూనిట్ తెలిపింది. కేవలం పదిరోజుల్లోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో రూ.143 కోట్లు (షేర్స్) రాబట్టినట్లు చెప్పారు. ఇది నాన్ బాహుబలి-2 రికార్డ్ అని వారు పేర్కొన్నారు. నిజాంలో రూ.35.69 కోట్లు, సీడెడ్ లో రూ.18.07 కోట్లు, వైజాగ్ లో రూ.18.80 కోట్లు, గుంటూరులో రూ.9.93 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.9.89 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.7.65 కోట్లు, కృష్ణాలో రూ.8.80 కోట్లు, నెల్లూరులో రూ.4.07 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.112.90 కోట్లు వసూలు చేసింది.
ఇక కర్ణాటకలో రూ.10.70 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లుఅర్జున్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అల..వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటించారు. టబు, రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, సుశాంత్, నివేదా పేతురాజు కీలకపాత్రలు పోషించారు. తమన్ అందించిన సుస్వరాలు కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more