టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లికి సంబంధించి వారం పది రోజులుగా వినిపిస్తున్న అనేక గుసగుసలకు ఎట్టకేలకు తెరపడింది. టాలీవుడ్ ప్రముఖ యంగ్ హీరోల మాదిరిగానే నితిన్ కూడా తన స్నేహితురాలైన షాలిని అనే యువతితో ప్రేమలో పడ్డారని, ఆమెను త్వరలోనే పరియణం చేసుకోబోతున్నాడని వచ్చిన వార్తలు నూటికి నూరుపాళ్లు నిజం. ఎందుకంటే ఈ వార్తను నిజమని చెప్పింది యంగ్ హీరో నితినే కాబట్టి.
ఇప్పటికే షాలినితో నిశ్చితార్థం చేసుకున్న యంగ్ హీరో.. ఏప్రిల్‌లో అమెను అర్థాంగిగా చేసుకోబోతున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 15న) నితిన్ నిశ్చితార్థం షాలినితో ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 14 వాలైంటెన్స్ డే నాడు సింగిల్ యాంథెమ్ పాడుకున్న ‘భీష్మ’ ఆ మర్నాడే పెళ్లికి రెడీ అయిపోయాడు. నితిన్ గతకొంత కాలంగా తన స్నేహితురాలు షాలినీతో ప్రేమలో ఉన్నాడు. కామన్ ఫ్రెండ్ వల్ల ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో పెద్దల్ని ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. శనివారం హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో ఘనంగా ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు.
ఇరు కుటుంబాలవారి రిలేటివ్స్‌తో పాటు స్నేహితుల నడుమ ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా జరిగింది. సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘‘పెళ్లిపనులు ఆరంభం.. మ్యూజిక్ స్టార్ట్స్.. మీ ఆశీస్సులు కావాలి’’.. అంటూ ట్వీట్ చేశాడు నితిన్. ఇక ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్లో నితిన్, షాలినీల వివాహ వేడుక నిర్వహించబోతున్నారు. సినిమాల విషయానికొస్తే.. నితిన్, రష్మికతో నటించిన ‘భీష్మ’ (సింగిల్ ఫరెవర్) ఫిబ్రవరి 21న విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’, సిినిమాతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more