Actor Srikanth's Father Passes Away టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కు పితృవియోగం

Tollywood hero srikanth s father passes away at hyderabad

Tollywood Actor, tollywood hero, Srikanth, Srikanth Father, respiration, death, MahaPrasthanam, Karnataka, Srikanth Meka, pelli sandadi, meka parameswara rao, lung, krishna, Karnataka, Jhansi Lakshmi, Gangavati, Crematorium, Tollywood, Entertainment, movies

Tollywood actor Srikanth's father Meka Parameswararao has passed away in Hyderabad. According to the reports, Srikanth's father passed away while undergoing treatment in one of the private hospitals in Hyderabad.

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కు పితృవియోగం

Posted: 02/17/2020 12:57 PM IST
Tollywood hero srikanth s father passes away at hyderabad

టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ హఠాన్మరణం చెంది 72 గంటలకు కూడా తిరగకుండానే.. ప్రముఖ హీరో శ్రీకాంత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వర రావు కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యం బారినపడిన ఆయన అసుపత్రిలో చికిత్స పోందుతూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ లో విషాదం వాతావరణం అలుముకుంది.

గత నాలుగు నెలలుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ బంజారాహీల్స్ లోని స్టార్ అసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. క్రితం రోజు రాత్రి అకస్మాత్తుగా పరిస్థితి వివషమించింది. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన చికిత్స పోందుతూనే అసుపత్రిలో కన్నుమూశారు. ఇవాళ ఆయన బౌతికఖాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

పరమేశ్వరరావుది కృష్ణా జిల్లాలోని మేకావారిపాలెం కాగా, ఆ తర్వాత ఆయన కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలేనికి వలస వెళ్లారు. పరమేశ్వరరావు - ఝాన్సీలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు శ్రీకాంత్, అనిల్ కాగా, ఓ అమ్మాయి నిర్మల ఉన్నారు. కాగా శ్రీకాంత్ కు పితృవియోగం కలిగిందన్న వార్త తెలినన సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీనటులు ఆయన నివాసానికి వచ్చి సంతాపాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood hero  Srikanth  Srikanth Father  respiration  death  MahaPrasthanam  Karnataka  Tollywood  

Other Articles