'నాన్నకు ప్రేమతో' సినిమాతో క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న సుకుమార్, 'రంగస్థలం' సినిమాతో మాస్ ఆడియన్స్ ను అలరించాడు. ఈ సారి కూడా ఆయన మరో మాస్ సబ్జెక్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. అయితే ఇంకా పట్టాలెక్కని చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలన్న విషయాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నాడని సినీవర్గాల నుంచి టాక్. స్టైలిష్ స్టార్అల్లుఅర్జున్ తో తెరకిక్కించనున్న ఈ మాస్ చిత్రాన్ని తనదైన స్టైల్లో రూపోందించాలని ఇప్పటికే స్ర్కప్టు వర్క్ పూర్తిచేసుకున్న సుకుమార్.. లాక్ డౌన్ ఎత్తివేత కోసం ఎదురుచూస్తున్నాడని సమాచారం.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే ఈ చిత్రంలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపించని విధంగా ఢిపరెంటుగా ఈ చిత్రంలో నటించనున్నారని టాక్. ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా బన్నీ కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా రష్మికను తీసుకున్నారు. అంతా అనుకూలించినా.. ఏదో సమస్య తలెత్తడం సాధరణ సమయంలోనే చిత్రషూటింగ్లలో సాధరణం. అలాంటిది ఈ చిత్రం గురించి మాత్రం అంతా తాను అనుకున్నట్లే జరుగుతుందని నమ్మకంగా వున్న సుకుమార్.. విడుదల తేదీని కూడా ఫిక్స్ చేసుకున్నాడట.
అంతా సవ్యంగా సాగితే ఏడాది సమయం తీసుకోనున్న ఈ సినిమా ఏడాది తరువాత విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా షూటింగుకి వెళ్లడం ఆలస్యమవుతోంది. దాంతో ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయాలని సుకుమార్ భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. సహజంగానే సుకుమార్ తన ప్రాజెక్టులకి ఎక్కువ సమయం తీసుకుంటాడు. అందువల్లనే ఆయన ఈ రిలీజ్ డేట్ సెట్ చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్న సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more