'నాన్నకు ప్రేమతో' సినిమాతో క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న సుకుమార్, 'రంగస్థలం' సినిమాతో మాస్ ఆడియన్స్ ను అలరించాడు. అయితే మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ తరువాత కొంత ఢిఫరేంట్ స్టోరీ అయినా అచ్చంగా రంగస్థలం లాంటి దశాబ్దాల క్రితం నేపథ్యమున్న కథనే ఎంచుకుని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చిత్రాన్ని రూపోందిస్తున్నారు. ఫర్ ఫెక్ట్ మాస్ స్టోరీతో ఈ మాస్ చిత్రాన్ని తనదైన స్టైల్లో రూపోందించాలని ఇప్పటికే స్ర్కప్టు వర్క్ పూర్తిచేసుకున్న సుకుమార్.. లాక్ డౌన్ ఎత్తివేత తరువాత సెట్స్ పైకి వెళ్లేందుకు ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నాడని సమాచారం.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే ఈ చిత్రంలో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపించని విధంగా ఢిపరెంటుగా ఈ చిత్రంలో నటించనున్నారు. శేషాచల అడవుల నుంచి సాగే ఎర్రచందనం స్మగ్లింగ్ లో వాటిని దొంగచాటుగా రవాణా చేసే లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ కనిపించనున్నట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కారించుకని తాజాగా ఇవాళ ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో బన్ని ఊరమాస్ లుక్ లో మాస్ అడియన్స్ పండగ చేసుకునేలా కనిపిస్తున్నాడు.
మాసిన గెడ్డం, మీసాలు .. విభిన్నమైన హెయిర్ స్టైల్ .. దుమ్ము పట్టేసిన షర్టుతో తీక్షణంగా చూస్తూ పక్కా మాస్ లుక్ తో అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. ఈ లుక్లో బన్నీ పక్కన ఎర్రచందనం దుంగలు ఉన్నాయి.అలసిపోయిన ముఖం.. పోలీసుల అరెస్టు చేయగా వారి ముందు నిందితుడిగా కూర్చున్న బన్నీ లుక్ ఈ సినిమాపై ఆసక్తిని రేపుతోంది. బన్నీ వెనుక వ్యాను.. అందులోనూ ఎర్రచందనం దుంగలు, బన్నీ పక్కనే గొడ్డలి ఉంది. బన్నీయే స్మగ్లర్ గా వాటిని కాజేసీ తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు లుక్ ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ అలరిస్తోంది.
తన పుట్టిన రోజు సందర్భంగా రెండో లుక్ ను తానే స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు అల్లు అర్జున్. ఈ మేరకు ఆయన రెండో లుక్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు 'పుష్పక్ నారాయణ్'. ఆయన పేరులోని 'పుష్ప'ను టైటిల్ గా సెట్ చేశారన్న మాట. అల్లు అర్జున్ పాత్ర పేరుకి .. ఆయన లుక్ కి మధ్య చాలా వైవిధ్యం వుంది. అదేమిటనే విషయంపైనే సుకుమార్ కథ నడిపిస్తాడని అర్థమవుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడీగా రష్మిక కనిపించనుంది. అడవి నేపథ్యంలో సాగే ఈ కథ, అభిమానులలో అంచనాలను అంతకంతకూ పెంచుకుంటూ పోతుంది. పట్టాలెక్కకుండానే పోస్టర్ తో అంచనాలు పెంచేసిన చిత్రమిది.
పుష్ప #Pushpa pic.twitter.com/sHFZspIt1z
— Allu Arjun (@alluarjun) April 8, 2020
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more