Telugu TV Actress Shanti Suspicious Death బుల్లితర నటి విశ్వశాంతి అనుమానాస్పద మృతి

Telugu tv actress shanti dies under suspicious circumstances

Anchor Shanti Dies In Suspicious Condition, TV Actress Shanti Died in Suspicious condition, TV Actress, TV Actress Shanti Is No More, Anchor Shanti Is No More, Telangana popular Anchor Shanti is No More, Anchor Shanti Demise News, Telugu TV Actress Shanti Dies Under Suspicious Circumstances, Vishwashanthi, shanti, vishwashanthi, TV anchor, TV actress, suspicious death, SR Nagar policestation, Hyderabad, Telangana, Crime

Popular Telugu TV anchor and serial actress Shanti alias Viswashanthi died under suspicious circumstances at her residence in Engineer's Colony of Yellareddyguda In Hyderabad, on Thursday, April 9. The area falls under the jurisdiction of SR Nagar Police Station limits.

బుల్లితర నటి విశ్వశాంతి అనుమానాస్పద మృతి

Posted: 04/09/2020 06:39 PM IST
Telugu tv actress shanti dies under suspicious circumstances

ప్రముఖ టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి  అనుమానస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఈమె ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడెం ఇంజనీర్స్ కాలనీలోని తన నివాసంలో గురువారం అమె శవమై కనిపించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఎలా చనిపోయిందనే విషయంపై అన్ని కోణాల్లో దర్యాప్త చేస్తున్నారు పోలీసులు. చుటుపక్కల వాళ్లను విచారిస్తున్నారు. అలాగే ఆమె ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు.

శాంతి ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఎవరైనా హత్యచేశారా.? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సివుంది. ఆమె ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అమె చివరిసారిగా ఎవరెవరితో సంబాషించిందన్న వివరాలను కూడా రాబడుతున్నారు. విశ్వశాంతి నివాసం పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీలను కూడా పరిశీలించారు. ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించారా.? లేదా.? అన్న వివరాలను కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

పోస్టు మార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.  గత 4  రోజులుగా ఇంట్లోంచి  ఆమె  బయటకు రాకపోవటంతో అనుమానం వచ్చి చుట్టు పక్కల  వారు పోలీసులకు సమాచారం అందించటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా విశాఖపట్నం జిల్లాకు చెందిన శాంతి అసలు పేరు విశ్వశాంతి. టీవి యాంకరింగ్ రంగంలో రాణించిన విశ్వశాంతి ఇటు నటనా రంగంలోనూ రాణిస్తున్న తరుణంలో ఇలా అకస్మికంగా అమె మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles