Pawan Kalyan travelled 600 kms daily పవన్ కల్యాణ్ రోజూ 600 కిమీ ప్రయాణం: దర్శకుడు వేణు

Pawan kalyan travelled 600 kms daily for 22 days

Pawan Kalyan, vakeel saab, dil raju, boney kapoor, sriram venu, pink, hyderbad to vijayawada, vijayawada to hyderabad, pawan kalyan travelled 600 kms dialy, tollywood, pawan kalyan's movies, pawan kalyan's photos, pawan kalyan's gallery, pawan kalyan's hit movies, tollywood, movies, entertainment

power star pawan kalyan during the first schedule of the film shooting in January, due to previous political commitments in Vijayawada, he had to shuttle 600 kms daily between Vijayawada and Hyderabad, which he did for 22 days, non-stop. He used to travel during the day and come to the sets during nights,” adds Venu.

అప్పట్లో పవన్ కల్యాణ్ రోజూ 600 కిమీ ప్రయాణం: దర్శకుడు శ్రీరాం వేణు

Posted: 04/22/2020 07:42 PM IST
Pawan kalyan travelled 600 kms daily for 22 days

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో చిత్రరంగంలోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం తనకున్న రాజకీయ కమిట్ మెంట్స్ తో పాటు ఇటు చిత్ర షూటింగ్ కోసం ఇచ్చిన డేట్స్ రెండింటికి ఎక్కడా క్లాష్ కాకుండా ఆయన చాలా శ్రమనే తీసుకున్నారని సమాచారం. హిందీ హిట్‌ ‘పింక్‌’కు తెలుగు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్‌, అనన్యా నాగళ్ల, ప్రకాశ్ రాజ్‌, నరేష్‌, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలోని అతిథి పాత్రలో ఇలియానా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, బోనీ కపూర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు,  

కాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ జరుగుతున్న సమయంలో పవన్‌ రోజూ 600 కిలోమీటర్లు ప్రయాణించేవారని దర్శకుడు వేణు శ్రీరామ్‌ చెప్పారు. సినిమా షూటింగ్‌కు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు పవన్‌ చాలా కష్టపడ్డారని తెలిపారు. దాదాపు 22 రోజులపాటు విజయవాడ టు హైదరాబాద్‌, హైదరాబాద్‌ టు విజయవాడ ప్రయాణించారని, ప్రతి రోజూ 600 కిలోమీటర్లు ట్రావెల్‌ చేసేవారని పేర్కొన్నారు. ఒక్క రోజు కూడా షూట్‌ను మిస్‌ చేయలేదంటూ ఆయన అంకితభావాన్ని ప్రశంసించారు. సినిమాకు సంబంధించిన ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తయిందని తెలిపారు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత మిగిలిన భాగం షూటింగ్‌ కూడా పూర్తి చేస్తామని అన్నారు. ఈ సినిమా తర్వాత పవన్‌-హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  vakeel saab  dil raju  boney kapoor  sriram venu  hyderabad to vijayawada  tollywood  

Other Articles