టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురం చిత్రంతో అందుకున్న హిట్ తో జోరుమీదున్నాడు. తాజాగా బన్ని హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూపోందిస్తున్న చిత్రం ‘పుష్ప’. కాగా, సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. లారీడ్రైవర్ లుక్ లో బన్నీ కనిపించనున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించనున్నారని ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప’ చిత్రంలో వకీల్ సాబ్ చిత్ర నటి కూడా బన్నితో రోమాన్స్ చేయనుందని వార్త చిత్రపురి వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
అమె ఎవరు.? ఏమా కథ అంటారా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు రెండేళ్ల తరువాత రీ-ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ పింక్ చిత్రం రిమేక్ గా తెలుగులో వకీల్ సాబ్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా మెరువనున్న నివేదా థామస్ కూడా ఇక బన్నీతో కలసి సందడి చేయనుంది. బన్నీ ప్రియురాలి పాత్రలో నివేదా కనిపించనున్నారని.. అంతేకాకుండా నివేదా థామస్ పాత్రకు ‘పుష్ప’ సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉంటుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు రష్మిక.. అటవీ శాఖ అధికారి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. నివేదా కన్ఫామ్ అన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదల చేసిన ‘పుష్ప’ ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. హాలీవుడ్‌కు చెందిన మిరోస్లా కుబా బ్రోజెక్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను కొంతకాలం పాటు నిలిపివేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more