Uma maheshwara ugra roopasya satellite rights record బడ్జెట్ కంటే అధిక ధరకు అమ్ముడుపోయిన శాటిలైట్ రైట్స్

Uma maheshwara ugra roopasya satellite rights sold at higher cost than film budget

Uma Maheshwara ugra roopasya, Arka media, venkatesh maha, movie budget, ott platform, satellite rights, satya dev, tollywood, movies, entertainment

Uma maheshwara ugra roopasya casting satya dev as hero and the lead role directed by Venkatesh Maha is in the news for selling the satellite rights. According to the latest rumor and speculations, satellite rights of Uma Maheshwara ugra roopasya were sold for a tremendous amount which was more than the budget of the film.

బడ్జెట్ కంటే అధిక ధరకు అమ్ముడుపోయిన శాటిలైట్ రైట్స్

Posted: 08/08/2020 12:10 PM IST
Uma maheshwara ugra roopasya satellite rights sold at higher cost than film budget

ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై  శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా ‘కేరాఫ్ కంచ‌పాలెం’ ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో రూపోందిన చిత్రం ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం ‘మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. స‌త్య‌దేవ్ హీరోగా న‌టించారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. అంతేకాకుండా టాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రం ఓ రికార్డ్‌ను క్రియేట్ చేసింది.

ఈ చిత్ర శాటిలైట్ రైట్స్.. చిత్ర బడ్జెట్ కంటే ఎక్కువ ధరకు అమ్ముడు పోవడం విశేషం. దీంతో చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ రూ. 2.5 కోట్లకు ఈటీవీ సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. అంతేకాదు, చాలా గ్యాప్ తర్వాత ఈటీవీ ఈ చిత్ర రైట్స్‌ను తీసుకోవడం విశేషం. ప్రస్తుతం నడుస్తున్న కష్టకాలంలో రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రానికి శాటిలైట్ రైట్స్ రూపంలోనే రూ. 2.5 కోట్లు రావడం అంటే మాములు విషయం కాదు. అందుకే ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’ ఓటీటీ బ్లాక్‌బస్టర్ అని టాలీవుడ్ అంతా చెప్పుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles