ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తతో తన గుండె బద్దలైనట్టుగా ఉందని మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ అన్నారు. సంగీత ప్రపంచానికి ఇదొక చీకటి రోజని చెప్పారు. బాలు మరణంతో ఒక శకం ముగిసిపోయిందని అన్నారు. అద్భుతమైన స్వరంతో తనకు ఎన్నో మధురమైన పాటలను బాలు అందించారని... తన విజయంలో ఆయన పాత్ర ఎంతో ఉందని చెప్పారు. ఘంటసాల వారసుడిగా ధ్రువతారలా దూసుకొచ్చిన బాలు.. తన మధురమైన గానంతో భాష, సంస్కృతుల సరిహద్దులను చెరిపేశారని చెప్పారు. దశాబ్దాల పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించారని కొనియాడారు. బాలుగారి స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని, తన మరణం ద్వారా ఏర్పడిన శూన్యాన్ని పునర్జన్మ ద్వారా ఆయనే భర్తీ చేస్తారని చెప్పారు. బాలు లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సూపర్ స్టార్ కృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 'ఈరోజు బాలు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్ణకరం. 'నేనంటే నేనే' సినిమాకి బాలు చేత అన్ని పాటలు పాడించాలని కోదండపాణిగారు ప్రపోజ్ చేశారు. దానికి మేమంతా ఒప్పుకున్నాం. ఆ సినిమాకి అన్ని పాటలు బాలు పాడారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఘంటసాల బతికున్నప్పుడు కూడా నాకు అన్ని పాటలు బాలు పాడేవారు. బాలు మన మధ్య లేకపోవడం బాధాకరం. అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వారి కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నా' అని కృష్ణ తెలిపారు.
తన గానంతో కోట్లాది మందిని పులకింపజేసిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తతో సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. మీ వంటి మహోన్నతమైన గాయకుడు మళ్లీ పుట్టడని కంటతడి పెడుతోంది. బాలు సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నానంటూ రజనీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. 'ఎన్నో ఏళ్లుగా నా స్వరం మీరే' అని ట్వీట్ చేశారు. మీ స్వరం, మీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాతో ఉంటాయని అన్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సర్ గురించి తెలిసిన తర్వాత నా గుండె పగిలింది. మీరు సంగీత ప్రపంచానికి చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
బాలసుబ్రహ్మణ్యం జీ మరణవార్త నన్నెంతో బాధించింది. ఈ లాక్‌డౌన్‌లో కొన్ని నెలల క్రితం ఓ కాన్సర్ట్ కోసం బాలసుబ్రమణ్యం గారితో ఆన్‌లైన్‌లో మాట్లాడా. ఆయన చాలా ఆరోగ్యంగా ఎప్పటిలాగే కనిపించారు. నిజంగా జీవితాన్ని మనం ఊహించలేం.. ఈ బాధను తట్టుకునే శక్తిని దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటున్నా.
అక్కినేని నాగార్జున స్పందిస్తూ.. బాలుగారితో గడిపిన క్షణాలన్నీ గుర్తుకొస్తున్నాయని, కళ్లు చెమ్మగిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 'అన్నమయ్య' సినిమా తర్వాత ఆయన నుంచి తనకు వచ్చిన ఫోన్ కాల్ ఇప్పటికీ గుర్తుందని చెప్పారు. తన జీవితంలో బాలు ఒక భాగమని అన్నారు. 'దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో' అని నాగార్జున ట్వీట్ చేశారు.
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై బాలకృష్ణ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన గానగంధర్వుడు ఆయనని.. దేశం గర్వించే గొప్ప గాయకుడని అన్నారు. ఆయన నిష్క్రమణ సినీ, సంగీత ప్రపంచానికే తీరని లోటు అని చెప్పారు. బాలుగారితో తనకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఆయన పాడిన నాన్నగారి పాటలను, తన పాటలను వినని రోజంటూ ఉండదని చెప్పారు. ఇలాంటి గొప్ప గాయకుడు, గొప్ప వ్యక్తి మనతో లేకపోవడం విచారకరమని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఆవేదన వ్యక్తం చేశాడు. 'తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే' అని ట్వీట్ చేశారు.
మహేశ్ బాబు స్పందిస్తూ... బాలుగారు ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని చెప్పాడు. ఆయనకు మరే గాయకుడు సాటి రాలేరని అన్నాడు. తమ గుండెల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నాడు. బాలుగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పాడు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించాడు.
రాంచరణ్ స్పందిస్తూ... ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండే బాలుగారు మరణించారనే వార్తతో షాక్ కు గురయ్యానని చెప్పాడు. ఆయన లేని లోటును పూడ్చలేమని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పాడు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇవాళ ఓ లెజెండ్‌ను కోల్పోయాం. నా కెరీర్‌లో హిట్లుగా నిలిచిన ‘ప్రేమ’, ‘పవిత్రబంధం’ వంటి సినిమాల్లో ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం. మీ ఖ్యాతి ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. బాలు కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా..
నా హృదయం లక్షలాది పాటలుగా మారి ముక్కలైంది. నేను బాలు గారితో కలిసి షూట్‌లో ఉన్నప్పుడు బాబు జున్నును తీసుకుని సెట్‌కు రమ్మని నా భార్య అంజుకు చెప్పా. లెజెండ్ బాలుతో దిగిన ఫొటో జున్ను జ్ఞాపకాల్లో ఉండాలి అనుకున్నా.
ప్రతి భారతీయుడి గుండెలో కొలువైన వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన స్వరం సంగీత ప్రపంచానికి చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనిషిలోని అన్నీ భావోద్వేగాలకు తగ్గట్టు పాటలు పాడిన ఆయన ఓ లెజెండ్. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాం.
ఇవాళ ఓ లెజెండ్‌ను కోల్పోయాం. దాదాపు 16 భాషల్లో వేల గీతాలు ఆలపించారు. ఆయన స్వరం.. తరం, ప్రాంతం అనే తేడా లేకుండా సంగీత ప్రియుల్ని ఒక్కటి చేసింది. మీరు చిత్ర పరిశ్రమకు చేసిన సేవ.. మా జ్ఞాపకాల్లో మిమ్మల్ని ఎప్పటికీ జీవంతోనే ఉంచుతుంది. బాలు కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు అగ్రశ్రేణి తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాలు గారు తెలుగు, తమిళ, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా ఏలారని, ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదని, ఆ ఏలిక మరి రాదు అని ట్వీట్ చేశారు జక్కన్న. చాలామంది తమిళ, కన్నడ సోదరులు ఎస్పీ బాలు తెలుగువాడంటే అంగీకరించేవాళ్లు కాదని, బాలు మావాడే అని గొడవ చేసేవాళ్లని తెలిపారు. అన్ని భాషల్లోనూ పాడి, అందరితోనూ 'మావాడు' అనిపించుకున్న ఘనత ఒక్క బాలు గారికే సాధ్యమైందని వివరించారు. ఆయన పాడిన పాటలు, మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయన్న రాజమౌళి... మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తిప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు.
భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలు తన సోదరుడే కాకుండా తన ఆరోప్రాణం కూడా అని పేర్కొన్నారు. బాలు ఇంత త్వరగా వెళ్లిపోతాడని ఊహించలేదని, ఇలాంటి సమయంలో ఏంమాట్లాడతామని ఆవేదన వెలిబుచ్చారు. "వాడి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని వాడి కుటుంబ సభ్యులు ఓర్చుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షిస్తున్నాను" అని కె.విశ్వనాథ్ తెలిపారు. ఇంతకంటే ఇంకేమీ మాట్లాడలేనంటూ సెలవు తీసుకున్నారు.
నా ప్రియమైన బాలు.. సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది.. సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి.. రాగాలన్నీ మూగబోయాయి.. నువ్వు లేని లోటు తీర్చలేనిది..!!
గంధర్వ లోకానికేగిన గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిసున్నా.
కొందరు గాయకులు పాడితే.. అది ఆడియన్స్ దగ్గరకు వెళ్లకముందే హిట్ అవుతుంది. అతి తక్కువ మందికి ఈ క్వాలిటీ ఉంటుంది. ఈ విషయంలో ఎస్పీబీ సర్ అగ్ర స్థానంలో ఉన్నారు. ఇవాళ మనం ఆయన్ను కోల్పోయాం.. ఆయన స్వరాన్ని కాదు. ఆయన గాత్రం ఎల్లప్పుడూ ఈ గాలిలోనే ఉంటుంది.
ఆగిపోయింది మీ గుండె మాత్రమే, మీ గొంతు కాదు.. మీరెప్పుడూ మాతోనే ఉన్నారు. ఉంటారు..
ఎస్పీ సర్ మీరు ఇకలేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. నా గుండె ముక్కలైంది.
నా కన్నీటిని ఆపుకోలేకపోతున్నా.. మిమ్మల్ని మిస్ అవుతున్నాం. నా హృదయం బాధతో నిండిపోయింది.
ఎస్పీ బాలు ఇక లేరనే వార్త జీర్ణించుకోలేనిదని సీనియర్ నటి విజయశాంతి అన్నారు. 'కోట్లాదిమందికి గానామృతాన్ని పంచినఎస్పీబీ త్వరగా కోలుకుని మళ్ళీ తన గానంతో అలరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారన్న వార్త తీవ్రంగా కలచివేసింది. గాయకుడిగా, సంగీత దర్శకునిగా నటునిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎస్పీబీ ఎంత ఎత్తుకు ఎదిగినా చివరి క్షణం వరకూ వినయ విధేయతలతో ఒదిగే ఉంటూ ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. తన అపార అనుభవాన్ని భావితరానికి అందాలని తపనపడ్డారు. పాట ఉన్నంత కాలం ఎస్పీబీ మన హృదయాల్లో సదా నిలిచే ఉంటారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more