మెగాస్టార్ చిరంజీవి చారిత్రక నేపథ్యమున్న ‘సైరా’ తరువాత నటిస్తున్న చిత్రం `ఆచార్య`. లాక్ డౌన్ కారణంగా షూటింగుకి అంతరాయం కలిగిన సినిమాలలో 'ఆచార్య' కూడా ఒకటి. టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా రూపోందుతున్న ఈ చిత్రం అన్ లాక్ తరువాత ప్రారంభిద్దామన్న తరుణంలో చిత్ర యూనిట్ లోని ప్రతీ ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. కాగా, మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ నివేదిక రావడంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. తనను కలసిన వారిని పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరిన విషయం తెలిసందే. అయితే గత ఏడు నెలలుగా నిలిచిపోయిన షూటింగును తిరిగి ప్రారంభించింది చిత్ర యూనిట్.
అయితే కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ఆయన ఇప్పట్లో ఆచార్య షూటింగులో పాల్గోనే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఐసీఎంఆర్ జారీ చేసిన పోస్టు కోవిడ్ మార్గదర్శకాలను ఆయన తప్పక ఫాలో కావాల్పిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి షూటింగులో పాల్గోనేందుకు రెండు నెలలు పట్టచ్చునని భావించిన దర్శకుడు కొరటాల శివ షూటింగును వాయిదా వేస్తే అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేయలేమని భావించి ప్రస్తుతం చిరంజీవి లేని సన్నివేశాలను చిత్రీకరించాలని నిర్ణయించుకుని.. ఆ ప్రకారం షెడ్యూల్ ని మార్చుతున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ తో చిత్రాన్ని చేయాలని రెండేళ్ల పాటు ఖాళీగా వున్న దర్శకుడు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంలో తప్పేమిలేదని టాక్ వినిపిస్తోంది.
ఇక దీనికి తోడు ఇది మెగాస్టార్ ఇచ్చిన సూచనేనని, దీంతో ఆయన అభిప్రాయం కూడా కలవడంతో.. ఇలా చిరంజీవి లేకుండానే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సన్నివేశాలు చిత్రీకరణ కోనసాగనుంది. కాగా, ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన సన్నివేశాలను కూడా ఇప్పుడు చిత్రీకరిస్తారట. అలాగే కథానాయిక కాజల్ కూడా త్వరలో షూటింగులో పాల్గొంటుందని అంటున్నారు. మొత్తానికి చిరంజీవికి కరోనా సోకడం సోకినా సినిమా విడుదలపై మాత్రం దీని ప్రభావం పడకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more