బాలీవుడ్ సినీపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మరీ ముఖ్యంగా కపూర్ కుటంబంలో విషాదం నెలకోంది. 2018 నుంచి వరుసగా కపూర్ కుటంబాన్ని విషాద ఘటనలు తీవ్ర అవేదనకు, అందోళనకు గురిచేస్తున్నాయి, ఇండియన్ లెజెండ్ యాక్టర్ రాజ్ కపూర్ కనిష్ట పుత్రుడు.. బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకత్వ రంగాలలో రాణించిన రాజీవ్ కపూర్ (58) మధ్య వమస్సులోనే తిరిగిరాని లోకాలకు తరలివెళ్లాడు. తీవ్రమైన గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబసభ్యులు అసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే అయన తుదిశ్వాస విడిచారు.
తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయనను అసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచారని అసుపత్రివర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని రిషి కపూర్ భార్య నీతూ కపూర్ వెల్లడించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రాజీవ్ కపూర్ ఫోటో షేర్ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. అదే విధంగా రాజీవ్ మృతిపట్ల అన్నయ్య రణధీర్ సంతాపం ప్రకటించారు. నేను నా తమ్ముడు రాజీవ్‌ను కోల్పోయాను. అతను ఇక లేడు. వైద్యులు తమ వంతు ప్రయత్నించినా తనను రక్షించుకోలేకపోయాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా దివంగత నటుడు రాజ్ కపూర్-కృష్ణ కపూర్‌లకు చిన్న కుమారుడు రాజీవ్ కపూర్. 2018లో రాజీవ్ కపూర్ పెద్ద సోదరి రీతూ నంద కన్నుమూసింది. ఆ తరువాత గత ఏడాదిలో ఆయన సోదరుడు రిషి కపూర్ కన్నుమూశాడు. ఇక ఇవాళ రాజీవ్ కపూర్ మరణంతో కపూర్ కుటుంబంలో విషాదం అలుముకుంది. రాజీవ్ కపూర్ ‘రామ్ తేరి గంగా మెయిలీ’ చిత్రంలోని నరేంద్ర పాత్రతో ప్రసిద్ది చెందారు. ఈ చిత్రం 1985 సంవత్సరంలో విడుదలైంది. ఆయన హిందీ చలనచిత్ర రంగంలోకి ఆరంగ్రేటం చేసింది మాత్రం 'ఏక్ జాన్ హై హమ్' (1983) చిత్రంతోనే, కాగా అయనకు పెద్దగా ఈ చిత్రం బ్రేక్ తీసుకురాలేదు.
దీంతో తన తండ్రి దర్శకత్వంలో రామ్ తేరీ గంగా మైలి చిత్రంలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తరువాత అస్ మాన్ (1984)లోనూ నటించారు. లవర్ బాయ్ (1988), జబర్ధస్ట్ చిత్రంలోనూ ఆయన హీరోగా నటించారు. రిషి కపూర్ కథానాయకుడిగా నటించిన 'ప్రేమ్ గ్రంథ్'కు దర్శకత్వం వహించారు. కాగా గతేడాది రిషీ కపూర్ క్యాన్సర్‌తో కన్నుమూసి.. ఏడాది గడవక ముందే తమ్ముడు రాజీవ్ కన్నుమూయడం కపూర్ కుంటుంబానికి తీరాన్ని శోకాన్ని మిగిల్చింది. కాగా రాజీవ్ కపూర్ ఆకస్మిక మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు, శ్రేయోభిలాషులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more