SS Rajamouli gives clarity on release of RRR movie ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర విడుదలలో పరంపరకు రాజమౌళి స్వస్తి

Ss rajamouli gives clarity on release of rrr movie

Jr NTR, Jr NTR birthday, happy birthday, SS Rajamouli, RRR poster, Rajamouli NTR, SS Rajamouli poster, Kumaram Bheem, Tollywood, Entertainment, movies

On Jr NTR's 38th birthday, director SS Rajamouli and the RRR team unveiled a fiery poster of the actor from the film. In the new poster, The Film Unit and The Director gives clarity on the release date of the Movie.

‘ఆర్ఆర్ఆర్’ చిత్ర విడుదలలో పరంపరకు రాజమౌళి స్వస్తి

Posted: 05/21/2021 12:12 PM IST
Ss rajamouli gives clarity on release of rrr movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపోందుతున్న భారీ బడ్జెట్, మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ‘రౌద్రం, రణం, రుధిరం’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూపులకు ఈ ఏడాది 13 అక్టోబర్ రోజున విజయదశమిని పురస్కరించుకుని విడుదల చేస్తామని జక్కన రాజమౌళి ఇప్పటికే అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. అయితే జక్కన చిత్రం అనగానే పారంపరంగా వస్తున్న సెంటిమెంట్.. సినిమా విడుదల తేదీ వాయిదా పడటం అన్న విషయం అభిమానులకు తెలిసిందే.

గత ఏడాది అన్ లాక్ తో యావత్ దేశం వ్యాపారాలకు తలుపులు తెరిచినా.. అన్ లాక్ ఐదు వరకు సినిమా షూటింగులకు అనుమతులు లభించలేదు. ఇక థీయేటర్లు మాత్రం గత ఏడాది డిసెంబర్ నుంచి తెరుచుకున్నాయి. ఈ క్రమంలో రెండో దశ కరోనా మహమ్మారి ఈ ఏడాది మార్చి నుంచి విజృంభించిన నేపథ్యంలో మళ్లీ చిత్ర పరిశ్రమలో షూటింగులకు బ్రేక్ పడింది. దీంతో ప్రతిష్టాత్మకంగా తెరెకెక్కుతున్న రణం, రౌద్రం, రుధిరం ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదాల పరంపరకు స్వాగతం పలికింది. అయితే తాజాగా మరోమారు వాయిదా పడుతుందా లేదా అన్న విషయంలో నిన్నటి ఎన్టీఆర్ న్యూలుక్ క్లారిటీ ఇచ్చింది.

యంగ్ టైగర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఫ్యాన్స్ కు కానుకను అందిస్తూ విడుదల చేసిన న్యూలుక్ ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమమౌతో్ంది. కుమరం భీమ్ పాత్రలో రౌద్రంగా కనిపిస్తూ రణంలో ప్రత్యర్థులపై తన చేతిలోని బల్లాన్ని నీటి లోంచి పైకి దూసుకువస్తూ విరసేలా వున్న లుక్ అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తోంది. కాగా ఈ పోస్టర్ లో విడుదల తేదిన 13 ఆగస్టుగానే ముద్రించిన రాజమౌళి.. అభిమానులకు తన వాయిదా పరంపరకు స్వస్తి పలికినట్టు చెప్పకనే చెప్పారు. దీంతో చిత్రం విడుదల తేదీపై మాత్రం క్లారిటీ రావడంతో అభిమానుల్లో సందడి నెలకోంది. ఈ సినిమాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ ఆయన సరసన ఒలివియా మోరిస్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, ఆయనకు జంటగా అలియా భట్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr NTR  Ram Charan  SS Rajamouli  RRR poster  Kumaram Bheem  Tollywood  

Other Articles