'Bheemla Nayak' title song released పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ అదుర్స్

Bheemla nayak title song released on pawan kalyan s birthday

Bheemla nayak, Power Star pawan kalyan, Pawan Kalyan Bheemla Nayak, Rana Dagubati, Daniel shekar, Rana fans, bheemla nayak title song, Ram miriyala, sri Krishna prithvi, Nithya Menen, Trivikram, Saagar K Chandra, Thaman S, Suryadevara Naga Vamsi, Tollywood, movies, Entertainment

The title song of Bheemla Nayak is released on the occasion of Power Star Pawan Kalyan’s birthday. This song is sung by S Thaman, Sri Krishna Prithvi and Ram Miriyala with additional vocal support from Darsanam Mogulaiah. Lyrics for the song are penned by Ramajogaiah Sastry and S Thaman has composed the music.

పవర్ కు ఎత్తినగేటు ఆ నేమ్ ప్లేటు.. ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ అదుర్స్

Posted: 09/02/2021 11:35 AM IST
Bheemla nayak title song released on pawan kalyan s birthday

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో ‘భీమ్లా నాయక్’ చిత్రం రూపోందుతున్న విషయం తెలిసిందే. పోలీసు అధికారి పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తుండగా, సంపన్న రాజకీయ కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పాత్ర పేరే 'భీమ్లా నాయక్'. పవన్ పాత్ర ప్రధానంగా మొన్న ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయగా, అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ అయప్పనుమ్-కోషియుమ్ చిత్రం రీమేక్ గా ఈ చిత్రం రూపోందుంతొంది.

ఈ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడు ఇవాళ ఏదో ఒక అప్ డేట్ వస్తుందని ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ అభిమానులకు చిత్రబృందం టైటిల్ సాంగ్ ను బహుమతిగా అందించింది. ఎందుకంటే ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం అన్న విషయం తెలిసిందే. భీమ్లా నాయక్ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ను చిత్రయూనిట్ విడుదల చేయడంతో ఫ్యాన్స్  ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అరకు అందాలను చూపిస్తూ.. అదివాసీల యాసతో పాటు గిరిజనులు మాటల్లో ఈ పాటను పల్లవిని రాశారు రామజోగయ్య శాస్తి.

ఆడగాదు ఈడగాదు అమీరుల్లా మేడకాదు.. గుఱ్ఱపు నీళ్ల గుట్ట కాడ.. అలుగువాగ తాండలోన.. భిమ్మ జెముడు చెట్టు ఉన్నది.. భిమ్మ చెముడు చెట్టు కింద అమ్మ నోప్పులు పడుతున్నాది.. ఎండ లేదు రాతిరి కాదు వేగు సుక్క పొడవంగానే.. పుట్టిండాడు పులిబిడ్డ.. పుట్టిండాడు పులిపిల్ల నల్లమల తాలుకాల.. అమ్మపేరు మీరాబాయి, ఆయన పేరు సోమలగండు.. నైనా పేరు సోమలగండు తాత పేరు బహుదూరు.. ముద్దుల తాత ఈర్ల నాయక్ పెట్టిన పేరు భీమ్లా నాయక్.. శభాష్ భీమ్లా నాయక్ అంటూ సాగుతుందీ పాట. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ కనిపించనుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles